Saturday, July 27, 2024

ఆఫీసులో ఒకేచోట‌ 8 గంటలు కూర్చోవడం ప్రాణాంతకం..

తప్పక చదవండి
  • ఐదు నిమిషాలు నడిస్తే, ఐదేళ్లకు పైగా బతుకుతారు..

న్యూ యార్క్ : ఎక్కువ సమయం కదలకుండానే కూర్చిని పనిచేయటం.. అనేది ప్రపంచంలో మిలియన్ల మందిని చంపేస్తున్న ప్రమాదం. శారీరక శ్రమ లేకపోవడం వల్ల 95% మంది ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. కార్యాలయంలో ఎక్కువ గంటలు కూర్చొని పని చేయడం వల్ల అనేక వ్యాధులు ఎటాక్‌ చేయటంతో చనిపోతున్నారని ఫ్రాన్స్ నేషనల్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మధుమేహం, గుండె సమస్యలు, మరణాలకు కారణం నిశ్చల జీవనశైలి ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటిగా తేల్చారు.. అందువల్ల, మీరు కూర్చునే సమయాన్ని తగ్గించడం అవసరం. దీని కోసం ఏం చేయాలి.. కొలంబియా యూనివర్శిటీ మెడికల్ సెంటర్ లో బిహేవియరల్ మెడిసిన్ ప్రొఫెసర్ కీత్ డియాజ్, ఈ నిశ్చల జీవనశైలిని విధానాన్ని మార్చడానికి మంచి మార్గాన్ని సూచిస్తున్నారు.. అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురించబడింది. పరిశోధనా బృందం 11 మంది వాలంటీర్లను నియమించింది. వారిని ఎనిమిది గంటల పాటు కుర్చీలో కూర్చోవాలని సూచించింది. వారు ల్యాప్‌టాప్‌లలో పని చేయడానికి, వారి ఫోన్‌లను చూసుకోవడానికి, ఉపయోగించేలా ఏర్పాట్లు చేశారు. వారంతా 40 నుండి 60 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. వారికి మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలేవి లేవు. వారు ఐదు రోజుల పాటు పరిశోధకులు సూచించిన పద్దతులను పాటించారు.. మొదటిది,ఎనిమిది గంటల పాటు నడవకుండా ఒకే చోట కూర్చుని పనిచేయాలి.

విశ్వవిద్యాలయ పత్రికా ప్రకటన ప్రకారం… పరిశోధకులు పరీక్షలో పాల్గొనేవారి మానసిక స్థితి, అలసట, పనితీరు స్థాయిలను పర్యవేక్షించారు. ఈ అధ్య‌య‌నం ప్ర‌కారం.. ఒకే స్థలంలో కూర్చుని రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు పనిచేసే వ్యక్తులు గుండెపోటు, స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం 20 శాతం ఎక్కువ అని తేలింది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం దాదాపు 50 శాతం పెరుగుతుందని నిర్ధారణ అయింది. అలాగే, ఎక్కువ సమయంలో కూర్చుని పనిచేసే వారి కంటే.. ఇతరులలో అలసట తక్కువగా ఉన్నట్టు గమనించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు