Friday, April 26, 2024

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ భూ కబ్జాలపై సిట్ నియమించాలి..

తప్పక చదవండి
  • ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్..
  • కండ్లు మూసుకున్న కేయూ అధికారులు.. కబ్జాలకెగబడుతున్న భూకబ్జాదారులు..
  • సర్వేనెంబర్లు 32/2, 38 లస్కర్ సింగారం శివారులో కొనసాగుతున్న కబ్జాలు..
  • పక్కనే ఉన్న పలువేల్పుల శివారులోని సర్వే నెంబర్లు 412 ,413, 414 లోని
    భూములు కబ్జాలయిన రీతిగా నేడు కూడా యదేచ్ఛకబ్జా.
  • కేయూ భూముల కబ్జాలో కీలక సూత్రధారుడు ఏడీ ప్రభాకర్.

హైదరాబాద్ : అధికారుల అండతో యదేచ్చగా భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారని కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ ఆరోపించారు.. కేయూ భూముల కబ్జాల వెనుక ఉన్నతధికారుల హస్తం ఉంది.. కబ్జాదారులని తేల్చినప్పటికీ చర్యలు చేపట్టలేని దుస్థితి నెలకొంది.. కబ్జాదారులపై అధికారులకు అంతమక్కువెందుకు..? 20 ఏళ్ల కబ్జాల చరిత్రలో అధికారులు వెలగబెట్టింది ఏమీ లేదు.. పీడీ యాక్ట్ లాంటి చర్యలు నిర్వహిస్తే తప్ప కబ్జాలకడ్డుకట్టలు పడవు అన్నారు జడ్సన్.. భూకబ్జా రౌడీలే రాజ్యమేలుతుంటే రాజకీయ అండ తోడైపాలిస్తుంది. కబ్జాల వెనకాలున్న అధికారపార్టీ నాయకులెవరు.? కలెక్టర్ల నివేదికలు లాండ్స్ కమిటీ నివేదికలు నీళ్ల పాలు చేస్తున్న విశ్వవిద్యాలయ అధికారులు. కేయూ భూములు కబ్జాలుచేస్తే పుట్టగతులుంటాయా..? కాపాడుతామని తెగ బిల్డప్పులిస్తూనే కబ్జాలకు సహకరిస్తున్న అధికారులు. మున్సిపల్ అధికారుల ముసుగులో అక్రమ అనుమతులు.. 15ఏళ్ల పోరాటంలో పహాని మార్చలేని కేయూ అధికారులు.. ఏళ్ల తరబడి ఉద్యమిస్తున్న విద్యార్థి సంఘాలు జీవితాలుత్యాగం చేసుకుంటుంటే అధికారులు భూకబ్జాదారులతో కుమ్మక్కవుతున్నారు. సీపీ రంగనాథ లాంటి మహనీయుని పరిపాలన ముందు కేయూ భూములకబ్జాలు మచ్చగా మారుతున్నాయా? ఉత్తరాలు రాసుడు ఊరుకుండుడు లక్షల్లోజీతాలు తీసుకునే అధికారులు చేసే పనులివేనా..? అని ప్రశ్నించారు..

కబ్జాలపై ప్రశ్నిస్తే భూకబ్జాదారులతో దాడులకుసిగొల్పుతున్న కేయూ అధికారులు.
పాలకమండలి సభ్యులారా ల్యాండ్స్ కమిటీ నివేదిక ఉందా మూసుకుపోయిందా. స్వయంగా కేయూ భూముల కబ్జాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన చర్యలు తీసుకోకపోవడం అక్రమాల కోసమేనా?. ఎన్నికుయుక్తులు పన్నైనా భూకబ్జా అక్రమార్కులకు వెన్నుదండగా నిలుస్తున్న విశ్వవిద్యాలధికారులు. మనోడే వదిలేయ్ కబ్జాచేస్తాడు ఏమైనా చేస్తాడు చూస్తూ మూసుకొండంటూ విచ్చలవిడి పైరవీలకెగబడుతున్న రాజకీయనాయకులు. భూరక్షణ దారులపై ప్రత్యక్ష దాడులు నిర్వహిస్తూ చంపడానికే ప్రయత్నించిన భూకబ్జాదారులకు కబ్జాలుచేయడం షరా మామూలైయిపోయింది. అడిగే నాథుడు లేడుశిక్షించే భాగ్యుడులేడు కబ్జా లాగేదేలా? కేయూ అధికారులారా గుండెల మీద చేయివేసుకొని చెప్పండి కబ్జాలవెనుక మీహస్తం లేదని?. కేయూ భూముల కబ్జాలో కీలక సూత్రధారుడు ఏడీ ప్రభాకర్. కలెక్టర్లు మారినా ప్రభాకర్ మారడు 12 సంవత్సరాల ప్రభాకరుడు ప్రభుత్వ భూములన్ని మాయం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర భూకోలతల కార్యాలయం నిద్రలోనుండి మేలుకొనేనా ఏడి ప్రభాకర్ పై చర్యలు తీసుకునేనా? అందరూ రక్షించేవారే.. మరి కబ్జాలేలా అవుతున్నాయి..? కేయూభూముల కబ్జాలపై సిట్ ను నియమించాలని, వరంగల్ సీపీ రంగనాథ్ ఆదేశాలు జారీ చెయ్యాలని, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు