Saturday, July 27, 2024

సీజనల్‌ జ్వరాలపైప్రజలే అప్రమత్తం కావాలి

తప్పక చదవండి
  • దోమలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
  • డెంగీ కేసుల రహిత జిల్లాగా ఖమ్మం నిలిచేలా కార్యచరణ
  • జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతీ వెల్లడి

నేలకొండపల్లి : వర్షాకాల సీజన్లో దోమ పుట్టకుండా, కుట్ట కుండా ఉండేలా ప్రజలే స్వీయ చర్యలు తీసు కోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, అలాగే అధి కారులకు ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ మాలతీ తెలిపారు. నేలకొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంగళవారం ఆమె ఆకస్మికంగా సందర్శిం చారు. హస్పిటల్‌ ఆవరణ అంతా కలియతిరిగి, రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశంను నిర్వహించి పలు సూచనలు, సల హాలు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు…. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని కోరారు. జిల్లాలో గతేడాది 711 డెంగీ కేసులు నమో దైనట్లు, కానీ ఈ సీజన్లో డెంగీ కేసు రహిత జిల్లాగా ఖమ్మంను ఆదర్శంగా నిలి పేందుకు కార్యచరణను రూపొందించినట్లు ఆమె తెలి పారు. జిల్లా, మండల స్థాయిలో అన్ని శాఖల అధికారుల ‘సమన్వయంతో ముందుకు సాగు తున్నట్లు తెలిపారు. ప్రతీ మంగళ, శుక్రవా రంల్లో ప్రత్యేక డ్రైడే…కార్యక్రమం ను నిర్వ హించాలని ఆదేశించినట్లు తెలిపారు. దోమలు ఉదృతి చెందితే కోవిడ్‌ కంటే ప్రమా దకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మూడు నెలలు పాటు సీజన్లో ప్రజలను అప్రమతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. నేలకొండపల్లి వైద్య శాలకు ప్రత్యేక మహిళ వైద్యురాలును ఏర్పాటు చేయ నున్నట్లు తెలిపారు. ప్రభుత్వ హస్పిటల్స్‌లో మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు. తెలిపారు. ఈ కార్య క్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్‌. కె.రాజేష్‌, సూపర్వైజర్‌ వీరన్న పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు