Friday, May 3, 2024

జర్నలిస్ట్ ‘బాబాయ్’ ఇకలేరు..

తప్పక చదవండి
  • అనారోగ్యంతో మృతి చెందిన సీహెచ్ వీఎం కృష్ణారావు
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన నారా లోకేశ్
  • సీనియర్ జర్నలిస్టుగా విశేష సేవలందించారని వెల్లడి
  • కృష్ణారావు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు అన్న బాలకృష్ణ

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సీహెచ్ వీఎం కృష్ణారావు(64) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణారావు.. గురువారం హైదరాబాద్‌లో కన్నుముశారు. అయితే.. మీడియా రంగంలో అందరూ ప్రేమగా బాబాయ్ అని పిలుచుకునే కృష్ణారావు మరణించటం పట్ల చాలా మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజాప్రయోజనాల కోణంలో కృష్ణారావు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవని కేసీఆర్ తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్న కేసీఆర్… కృష్ణారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీహెచ్‌ ఎంవీ కృష్ణారావు మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు, ఇంగ్లీషు జర్నలిజంలో కృష్ణారావు మంచి ప్రావీణ్యం పొందారని జగన్ పేర్కొన్నారు. జర్నలిస్టుగా కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణారావని కొనియాడారు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు జగన్.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు