Monday, April 29, 2024

ముగిసిన మూడో రోజు ఆట..

తప్పక చదవండి
  • పూర్తి ఆధిపత్యం లో భారత్ జట్టు.. పోర్ట్ ఆఫ్‌ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో భారత జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు ముందు ఏకంగా 438 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా.. వారిని ఒత్తిడిలో పడేసింది. దీనికితోడు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ముఖేశ్‌ కుమార్‌లు ఈ ఇన్నింగ్స్‌లో విండీస్‌ను ఆదిలోనే దెబ్బకొట్టారు. కీలకమైన బ్రాత్‌వైట్‌ (75), టగ్‌నరైన్‌ చందర్‌పాల్‌ (33), మెకంజీ (32) వికెట్లను పడగొట్టారు. ప్ర‌స్తుతం క్రీజులో జేసన్ హోల్డర్ (11), అథనేజ్‌ (37) ఉన్నారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల న‌ష్టానికి 229 స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ జట్టు ఇంకా 209 పరుగుల వెనుక‌బ‌డి ఉంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయ‌గా.. మహ్మద్‌ సిరాజ్‌, అశ్విన్‌, తొలి టెస్టు ఆడుతున్న ముఖేశ్‌ కుమార్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అంత‌కుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 86/1తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన వెస్టిండీస్‌.. టీ విరామానికి 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. విండీస్ టాప్‌-3 బ్యాటర్లు బ్రాత్‌వైట్‌ (75), టగ్‌నరైన్‌ చందర్‌పాల్‌ (33), మెకంజీ (32) రాణించడంతో కరీబియన్లు కనీస పోటీ ఇవ్వగలిగారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు