Thursday, May 16, 2024

అభిమానుల కోసం సొంత వెబ్ సైట్..

తప్పక చదవండి
  • హీరోయిన్ తాప్సి వెబ్ సైట్..

అగ్ర కథానాయిక తాప్సీ ఇటీవల ‘తాప్సీక్లబ్‌.కామ్‌’ అనే వెబ్‌సైట్‌ను ఆరంభించింది. నిజమైన అభిమానులతో తన వ్యక్తిగత, సినిమా విశేషాలను పంచుకునేందుకు ఈ వెబ్‌సైట్‌ వేదికగా ఉంటుందని ఈ భామ పేర్కొంది. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ మొత్తం విద్వేషంతో నిండిపోయాయని, నిజమైన అభిమానులు ఎవరో తెలుసుకోలేని పరిస్థితి ఉందని తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది. నిజాయితీగా తన సినిమాలను ఇష్టపడేవారి కోసం ఈ వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దానని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ఈ సైట్‌లో నిజమైన అభిమానులకే ప్రవేశం ఉంటుంది. నేను చేస్తున్న సినిమాలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాను. అలాగే వారితో ప్రతీ వారం ముఖాముఖీ ఉంటుంది.

నా పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించాలనుకుంటున్నా. ప్రస్తుతం సోషల్‌మీడియాను నమ్మే పరిస్థితి లేదు. అక్కడ ట్రోలర్స్‌ ఎక్కువైపోయారు. నిజమైన అభిమానులకు చేరువగా ఉండాలనే లక్ష్యంతో ఈ సైట్‌ను మొదలుపెట్టాను’ అని తాప్సీ పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ హిందీలో షారుఖ్‌ఖాన్‌ సరసన ‘డంకీ’ చిత్రంలో నటిస్తున్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు