Wednesday, May 15, 2024

342 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు..

తప్పక చదవండి
  • ప్రకటించిన ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. అకౌంట్స్, ఆఫీస్, కామ‌న్ కేడ‌ర్, ఫైనాన్స్, ఫైర్ స‌ర్వీసెస్, లా త‌దిత‌ర విభాగాల‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్, సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి న్యూఢిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బట్టి బ్యాచిల‌ర్ డిగ్రీ, బీ.క‌మ్, బీఈ, బీటెక్, సీఏ, ఐసీడ‌బ్ల్యూఏ, ఎంబీఏ, ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ఆన్‌లైన్ ప‌రీక్ష, ప‌ర్స‌ర‌ల్ ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్ర‌క్రియ ఆగ‌ష్టు 05 నుంచి ప్రారంభంకానుండ‌గా.. సెప్టెంబర్ 04 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు.

మొత్తం పోస్టులు : 342.. పోస్టులు : జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్, సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అర్హతలు : బ్యాచిల‌ర్ డిగ్రీ, బీ.క‌మ్, బీఈ, బీటెక్, సీఏ, ఐసీడ‌బ్ల్యూఏ, ఎంబీఏ, ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.. వయస్సు : సెప్టెంబర్ 04 నాటికి 27 నుంచి 30 ఏండ్లు మించకూడదు.. ఎంపిక : ఆన్‌లైన్ ప‌రీక్ష, ప‌ర్స‌ర‌ల్ ఇంట‌ర్వ్యూ ద్వారా.. దరఖాస్తు : ఆన్‌లైన్‌లో.. జీతం : నెలకు రూ.31000 నుంచి రూ.140000 (పోస్టుల‌ను బ‌ట్టి).. దరఖాస్తు ఫీజు : రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు).. దరఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేదీ : ఆగ‌ష్టు 05.. చివరితేదీ : సెప్టెంబర్ 04.. వెబ్‌సైట్ : www.aai.aero

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు