Wednesday, April 24, 2024

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుండి మా ప్రాణాలను కాపాడండి

తప్పక చదవండి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబం
    నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్‌ లోని కొత్త వెంచర్‌ చేస్తున్న బత్తిని శ్రీనివాస్‌ మరియు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల బృందం నుండి మాకు ప్రాణ హాని ఉందని వారి నుంచి మా కుటుంబ సభ్యులకు ప్రాణాలు కాపాడాలని నర్సంపేట పోలీసులకు బాధిత కుటుంబం మొరపెట్టుకున్నది. పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ నెక్కొండ రోడ్లోని గత 8 ఏళ్ల క్రితం చేసిన వెంచర్లు మూడు ప్లాట్లు కొన్నామని అప్పుడు లేఅవుట్‌ చేసిన క్రమంలో 33 ఫీట్ల దారి తీశరని అప్పటివరకు బాగానే ఉన్నా మా ప్లాట్ల వెనుక ఇప్పుడు బత్తిని శ్రీను వారి రియల్‌ ఎస్టేట్లో బృందం మరో మూడు ఎకరాల్లో కొత్త వెంచర్‌ చేస్తున్న క్రమంలో మా పాత వెంచర్‌ రహదారి 33 ఫీట్లు ఉన్నప్పటికీ 60 ఫీట్ల దారిగా లేఅవుట్‌ లో చూపించడంతో మాకు ఆపద వస్తుందని నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్‌ కు కలెక్టర్కు డిటిపిసి అధికారులకు ఫిర్యాదు చేశామని దానిని మనసులో పెట్టుకొని ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో మా ఇంటికి ఇటుక పేడ్డలు కర్రలతో వచ్చి నాన్న బూతులు మాట్లాడుతూ మమ్మల్ని మా కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరిచారని అంతేగాక మా కుమారుడైన యుగంధర్‌ పై కర్రలతో దాడి చేశారని మా కుటుంబ సభ్యులను పిల్లలను చంపేస్తామని తీవ్ర పరుష పదజాలంతో తిట్టడంతో భయంతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నమని మా కుటుంబ సభ్యులపై దాడి చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బత్తిని శ్రీనివాస్‌ ముంజాల శ్రీనివాస్‌ బూడిద శ్రీనివాస్‌ తదితరులతోపాటు మరో పదిమంది పై చట్టపరంగా మాకు న్యాయం చేయాలని షేర్ల వీరస్వామి కుటుంబ సభ్యులు వాపోయారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు