Friday, May 10, 2024

పారిశుద్ధ్యం శూన్యం..

తప్పక చదవండి
  • గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం..
  • మురికి కంపుతో పెంట కుప్పలు, సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోని సంబంధిత అధికారులు..
    పరిగి : గ్రామాల్లో అభివృద్ధి ధ్యేయంగా ప్రవేశపెట్టిన పరిశుద్ధ పనులు చాప కింద నీరులా కనిపిస్తున్నాయి. గ్రామాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన కొన్ని కార్యక్రమాలు కనుమరుగైపోయాయి. అధికారుల ఉరుకులు పరుగులు తప్ప సమస్యలు పరిష్కారం కాలేదు. గ్రామాల్లో సమస్యలు తీష్ట వేసి కనిపిస్తున్నాయి. గ్రామంలో ఉండే ప్రధాన సమస్యలపై దృష్టి సారించినట్లు కనబడుటలేదు. పనులు పూర్తి కాకుండానే పూర్తయినట్లు ముగించారు. సమస్యలు ఉన్న జరిగినట్లు తీర్చినట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లా, దోమ మండల కేంద్రం లోని 4 వార్డు లో మురికి కాంపుతో పెంట గుంతలో నీరు మొత్తం నిండి దోమలతో కాలనీ వాసులు విష జ్వరాలతో బాధ పడుతున్నారు. వర్ష కాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒక పక్క అధికారులు చర్యలు చేపడుతున్నా మరో పక్క గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్షం వల్ల గుంతలలో నీరు నిండి మురికి కంపుతో వాసనకు బరించలేకుండా ఉన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి చేయాలని మంచి ఉద్దేశంతో మొదలు పెడితే సమస్యలు తీర్చకుండానే నీరుగార్చారు. కాలనీవాసులు గ్రామపంచాయతీ కార్యదర్శి కి దరఖాస్తు ఇచ్చిన, ఎన్నిసార్లు అడిగినా చేస్తాంలే చేస్తాంలే మొండి సమాధానం చెప్తున్నారు.ఈ ఈ సమస్య మండల కేంద్రంలోని నాలుగవ వార్డు కాలనీలో ఉండటం విశేషం….? అంతేకాకుండా. అంబేద్కర్‌ నగర్‌ లోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణలో దట్టంగా పిచ్చి మొక్కలతో నీరు నిల్వ ఉండి కంపు కొడుతుంది. చదువుకోవడానికి బడికి వెళ్తున్న విద్యార్థులు దోమల బారిన పడి రోగాలకు గురవుతున్నారని అక్కడక్కడ గుసగుసలు వినబడుతున్నాయి. కావున సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సమస్యలు పూర్తి చేసి పెండ గుంతలను పుడ్చి వేయాలని కాలనీ వసూలు అధికారులను కోరుతున్నారు.
  • గత కొన్ని రోజులుగా రోగాలతో బాధపడుతున్నాం… నా పేరు కావాలి మణెమ్మ ఇంటి వెనకాల ఉన్న పెంటకుప్పలల్లో నీరు నిండి వాసనతో దోమలతో గత కొంతకాలంగా రోగాలతో బాధపడుతున్నాం. కావున అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
  • పెంటకుప్పలల్లో నీరునిండి దోమలతో విష జ్వరాలతో బాధపడుతున్నాము.. నా పేరు చాకలి వెంకటమ్మ మేము 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం ఇంటి వెనకాల లోతైన పెంట గుంతలు ఉండడంతో ఆ గుంతలలో నీరు నిండి మా ఇల్లు గోడలకి తేమ వస్తుంది. దోమలతో విష జ్వరాలు వస్తున్నాయి. కౌణాధికారులు స్పందించి చర్యలు తీసుకోగలరు అని కోరుతున్నాను.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు