Monday, May 20, 2024

నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో లేఆఫ్స్‌..

తప్పక చదవండి

ఆర్థిక మాద్యం కారణంగా కంపెనీలు పొదుపు మత్రం పాటిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పలు కార్పొరేట్‌ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. వందేళ్ల చరిత్ర ఉన్న నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సైతం పలువురు ఉద్యోగులను తొలగించింది. 100ఏళ్లకు పైగా సహజమైన ప్రపంచాన్ని భౌగోళిక అంశాలను ప్రజలకు వివరించిన మ్యాగజైన్.. చివరగా 19 మంది స్టాఫ్ రిపోర్ట్స్‌ను తొలగించింది. మ్యాగజైన్‌ ప్రచురణను సైతం నిలిపివేసింది. ఇక ఏ న్యూస్‌ స్టాండ్‌లోనూ మ్యాగజైన్‌ కనిపించదు. అలాగే ఆడియో విభాగంలోనూ పలువురు ఉద్యోగులను తప్పించింది. 1888లో తొలిసారిగా ప్రచురణను ప్రారంభించిన నేషనల్‌ జియోగ్రాఫికల్‌ మ్యాగజైన్ చివరి రిపోర్టర్లను తొలగించింది. సైన్స్‌, సహజత్వానికి పెద్దపీట వేసే ఈ సంస్థ కొద్ది రోజుల కిందట డిస్నీ పరిధిలోకి వెళ్లింది. ఆ తర్వాత డిస్నీ అంచెలంచెలుగా సిబ్బందిని తగ్గించుకుంటూ వచ్చింది. ప్రస్తుతం చివరగా మిగిలిన స్టాఫ్‌ రిపోర్టర్లను సైతం తొలగించగా.. సంస్థతో అనుబంధం ఉన్న రచయితలు సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి గురయ్యారు. నాట్ జియో తన స్టాఫ్ రైటర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. తాము ఎంతో అదృష్టవంతులమని, నమ్మశక్యం కాని జర్నలిస్టులతో కలిసి పని చేశామని, ఇదో గౌరవమని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మ్యాగజైన్‌ మాతృసంస్థ డిస్నీ అవలంభించిన ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్‌లో రెండోసారి ఉద్యోగులను తొలగించింది. 2015లో తొలిసారిగా ఆరుగురు టాప్‌ ఎడిటర్లను తొలగించింది. విజువల్ మీడియాను తట్టుకుని నిలబడేందుకు ప్రయత్నించింది. స్టాఫ్‌ ఉద్యోగులను తొలగించి ఫ్రీలాన్సర్లను నియమించుకుంటున్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు