Saturday, May 18, 2024

10రోజుల్లో అన్ని మండల కమిటీలు పూర్తి చేస్తాం

తప్పక చదవండి
  • పీఏసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించాం.
  • పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ గా షబ్బీర్ అలీ గారు బాధ్యత వహిస్తారు.
  • మండల కమిటీలకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వచ్చాయి.
  • గాంధీ భవన్ మీడియా సమావేశంలో రేవంత్ వెల్లడి..

హైదరాబాద్: గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.. ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలు బీఆరెస్ సొంత వ్యవహారంలా చేస్తోంది. ఇది ప్రజలకు అసౌకర్యంగా మారింది.. దీన్ని ఖండించాలని ఈ కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిపోయింది. పరిపాలన వ్యవస్థ స్తంభించిపోయింది. గ్రామస్థాయి నుంచి అందరు అధికారులు బీఆరెస్ సేవలో మునిగిపోయారు. దశాబ్ది ఉత్సవాలు కాదు…. దశాబ్ది దగా… బీ.ఆర్.ఎస్. మోసాలను ప్రజల్లోకి తీసుకెళతాం.. ఈ నెల 22 న 119 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు తీయాలి. ఈ నిరసన ర్యాలీలో రావణాసురుడి రూపంలో ఉన్న కేసీఆర్ పది వైఫల్యాలతో కూడిన దిష్టిబొమ్మ దగ్ధం చేయాలి.. ఆర్డీఓ కార్యాలయాలు లేదా ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతిపత్రం సమర్పించాలి. పదేళ్లలో కేసీఆర్ అటకెక్కించిన హామీలను ప్రజల్లోకి తీసుకెళతాం.. కేజీ టూ పేజీ, ఫీజు రీయింబర్స్ మెంట్ , నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్ హామీల అమలు ఊసే లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తుచేసేలా మా నిరసన కార్యక్రమాలు ఉంటాయి.. బీసీ డిక్లరేషన్, మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్ పై చర్చ జరుగుతోంది. భట్టి పాదయాత్ర ఈ నెలాఖరులో ముగుస్తుంది. ఖమ్మంలో జాతీయ నాయకులతో ఒక భారీ ముగింపు సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నాం. భట్టితో సంప్రదించి ముగింపు సభ నిర్వహించాలనుకుంటున్నాం. బీసీలలో ఉన్న అన్ని కులాలకు లక్ష రూపాయల రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. బీ.నర్సింగరావు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి.. అలాంటి ఆయనకు ప్రభుత్వ పెద్దలు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం దురదృష్టకరం.. కేటీఆర్ సినిమా ఇండస్ట్రీలో ఎవరివైపు ఉంటారో అందరికీ తెలిసిందే.. తెలంగాణ కవులు, కళాకారులను అవమానించే హక్కు కేటీఆర్ కు లేదు. ఇప్పటికైనా వారిని గౌరవించి వారికి అపాయింట్ మెంట్ ఇవ్వాలి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ అవమానించారు. పదేళ్లు పూర్తయినా 600 మంది అమరులను కూడా గుర్తించలేకపోయారు. కేటీఆర్ పరిపక్వతలేని, బాధ్యత లేని మంత్రి.. అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి.. అందుకే మా కార్యాచరణ. పథకాలు కొనసాగిస్తామని చెప్పడం కేసీఆర్ ను సీఎం గా కొనసాగాలని కోరుకుంటునట్టే.. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన ఉండాలని వారు కోరుకుంటున్నారు. వాళ్లిద్దరూ ఒక్కటే అని మేం ముందునుంచీ చెబుతున్నాం.. రెండవ రాజధానిపై ప్రతిపాదన వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళుతుందా? రాష్ట్రానికి వెళుతుందా తెలియాలి. విస్తృతంగా చర్చించిన తరువాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలి. చేరికలపై ఊహాగానాలు వద్దు. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయి… పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక మేమే అధికారికంగా ప్రకటిస్తాం.. తెలంగాణ ఉద్యమంలోలా… కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో మీడియా కూడా భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు