Monday, April 29, 2024

పద్మశాలీ భవన్ లో రసాభసా గా మారిన బీసీ బంధు సమావేశం..

తప్పక చదవండి
  • బీసీలను చీల్చుతున్న ప్రభుత్వ కుట్రలో భాగస్వామ్యులుగా కులసంఘ నాయకులు..
  • చేనేత వర్గానికి తీవ్రంగా నష్టం వాటిల్లినా,400 మంది నేతన్నలు ఆత్మహత్య పాలయినా
    ప్రభుత్వాన్ని ప్రశ్నించని పద్మశాలీ భవన్ నేతలు;
  • రెండు వారాల వ్యవధిలో చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం
    ఆదుకోకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాం ..
  • కుల సంఘాల భవనాలను రాజకీయ వేదికలుగా మారుస్తున్నారు..బీసీలకు
    ఇప్పుడు కావాల్సింది పథకాలు కాదు, అధికారంలో వాటా;
  • పద్మశాలీ భవన్ వేదికగా బీసీల ఉద్ఘాటన..: దాసు సురేశ్ – అధ్యక్షులు, బీసీ రాజ్యాధికార సమితి

హైదరాబాద్ నారాయణ గూడలో పద్మశాలి భవన్ లో అఖిల భారత పద్మ శాలి సంఘం ఆధ్వర్యంలో… బీసీ బంధు , భవిష్యత్తు కార్యాచరణపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రసాభాస మారింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ , తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ తో పాటు… పలు బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. సమావేశం జరుగుతుండగా… బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ పెద్ద ఎత్తున చేనేత ఆత్మహత్య బాధిత కార్మిక వితంతు మహిళలతో కలిసి ఒక్కసారిగా వాగ్వాదానికి దిగారు. బాధిత మహిళలు తమ ఆవేదనను తెలియజెప్పడానికి నిర్వాహకులు అవకాశం ఇవ్వకపోవడమే కాకుండా రాష్ట్రంలో గడచిన 9 ఏళ్లలో 400 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకొని, కనీసం వారిని పరామర్శించని అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు బీసీ బంధు పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని దాసు సురేష్ మండిపడ్డారు. ఇదే విషయంపై సంఘం నాయకులను నిలదీశారు. దీంతో భయానక వాతావరణం నెలకొంది.. కార్యక్రమానికి హాజరైన వివిధ పార్టీల సీనియర్ నాయకులు సర్ది చెప్పే ప్రయత్నాలు చేసినా బాధిత మహిళలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఒక్క సారి వాతావరణం వేడెక్కింది. ,ఇరు వర్గాలకు తోపులాటతో బాటు తీవ్ర వాగ్వివాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింప జేశారు. ఒకప్పుడు పద్మశాలి భవన్ ను ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యమానికి నిలయం చేశారని… కానీ ప్రస్తుత పద్మశాలి నాయకులు పాలకులకు తొత్తులుగా మారిపోయారని పద్మశాలీ నాయకత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నారని దాసు సురేశ్ మండిపడ్డారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు , సహకార సంఘాల నిర్వీర్యం, నకిలీ చేనేతలు, చేనేతపై జీఎస్టీ వంటి సమస్యలను పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అఖిల భారత పద్మశాలీ భవన్ నాయకులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి వారి స్వార్ధ ప్రయోజనాలకు పద్మశాలీలను , ప్రజలను బలి చేస్తున్నారని ఆరోపించారు.. రెండు వారాల వ్యవధిలో 400 మంది ఆత్మహత్య బాధిత చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడానికి దిగిరాక పోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని, బాధిత ఆడబిడ్డలకు అండగా ఈ సమావేశానికి విచ్చేసిన నాయకులందరూ మానవతా దృక్పథం తో అండగా నిలవాలని దాసు సురేశ్ కోరారు.. బీసీ లకు రాజకీయ అధికారం తోనే వారి సమస్యలు పరిష్కరింపబడుతాయని అలా కాక కుల సంఘ నాయకులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రజల దృష్టి మళ్లిస్తూ పథకాలపై చర్చలు చేయడం విలువైన కాలాన్ని హరిస్తాయని హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు