Friday, May 10, 2024

మేడ్చల్‌ పట్టణంలో రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం

తప్పక చదవండి
  • ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
    మేడ్చల్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేడ్చల్‌ నియోజకవర్గం మేడ్చల్‌ పట్టణంలోని అంబేద్కర్‌ కూడలిలో బి అర్‌ ఎస్‌ పార్టీ శ్రేణులతో కలిసి రేవంత్‌ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన మంత్రి మల్లారెడ్డి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ విద్యుత్తు రద్దు చేయాలనీ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విచక్షణ లేనివి అని ఎద్దేవ చేశారు.తెలంగాణ రైతాంగంపై కాంగ్రెస్‌ కక్ష కట్టింది అని ఆరోపించారు.70ఏళ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్‌ ద్రోహం చేసింది అని ప్రశ్నించారు.దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదగాలని 24 గంటల ఉచిత కరెంటు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కే దక్కుతుంది అని అన్నారు.కాంగ్రెస్‌ పాలనలో అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఉండేది అని.ఇప్పుడు స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారు అని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రైతులకు భరోసగా రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ భారత దేశానికి రోల్‌ మోడల్‌ గా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ ప్రభుత్వం అని ఆశ బావం వ్యక్తం చేశారు.మొదటినుంచి కాంగ్రెస్‌ కు రైతులంటే చిన్న చూపే, మొన్న ధరణి వద్దన్నారు ఇప్పుడు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్‌ సరఫరా సరిపోతుందని అంటున్నారు అని అన్నారు.5 మినిషాలలో భూమి రిజిస్ట్రేషన్‌ అవుతున్న ధరణి పోర్టల్ని కూడా వద్దంటున్నారు.రైతులతో పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వమే గద్దె దిగే పరిస్థితి వచ్చింది అని తెలిపారు.దేశానికి వెన్నుముకైనా రైతును రాజు చేయాలని సీఎం కేసీఆర్‌ గారు రైతుల కోసం మరే రాష్ట్రంలోనూ లేని విధంగా రైతుల సంక్షేమం కోసం 30 వరకు రకరకాల పథకాలను అమలు చేస్తున్నారు అని అన్నారు.మల్లొకసారి రాబందు మూడు గంటల మాట ఎత్తితే.. రైతుల చేతుల్లో మాడు పగలడం ఖాయం అని.తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం, తెలంగాణ రైతులంతా ఇదంతా దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో మూడు గంటల అన్న కాంగ్రెస్‌ పార్టీని మాడు -మాడు చేసి చిత్తుచిత్తుగా ఓడగొట్టి రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జవహర్‌ నగర్‌ మేయర్‌ కావ్య,మున్సిపాలిటీ చైర్మన్లు దీపికా నర్సింహా రెడ్డి, లక్ష్మి శ్రీనివాస్‌ రెడ్డి, మున్సిపల్‌ అధ్యక్షుడు శేఖర్‌ గౌడ్‌, సంజీవ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, చీర్ల రమేశ్‌, మండల అధ్యక్షుడు దయానంద్‌ యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భాస్కర్‌ యాదవ్‌, వైస్‌ ఎంపిపి వెంకటేశ్‌ ముదిరాజ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్యనారాయణ, రైల పూర్‌ సీనియర్‌ నాయకుడు మెట్టు శ్రీకాంత్‌ రెడ్డి, పి ఎ సి ఎస్‌ చైర్మన్‌ రణదీప్‌ రెడ్డి, సద్ది సురేష్‌ రెడ్డి,ప్రణిత శ్రీకాంత్‌ గౌడ్‌, లక్ష్మి శ్రీనివాస్‌ రెడ్డి,కొండల్‌ రెడ్డి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మహేష్‌ కురుమ, మర్రి శ్రీనివాస్‌ రెడ్డి, మండల నాయకులు పాషా, సర్పంచ్‌ బాబు యాదవ్‌,, కో అప్షన్‌ సభ్యులు, మండల మరియు మున్సిపాలిటీ బి అర్‌ ఎస్‌ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు