Sunday, April 28, 2024

హరితహారం వృక్షాలు నరికివేత

తప్పక చదవండి

కీసర : హరితహారంలో భాగంగా యాద్గార్పల్లి గ్రామంలో నాటినచెట్లు నరికివేతకు గురవుతున్నాయి. సుమారు 4 సంవత్సరాల వయస్సు గల కొన్ని వందల చెట్లను అర్దాంతరంగా నరికి వేశారు.యాద్గారిపల్లి గ్రామం వెస్ట్‌ రెవెన్యూ పరిధిలోని శుభం గార్డెన్‌ ఎదురుగా సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో, గత నాలుగు సంవత్సరాల క్రితం హెచ్‌ఎండిఏ లేఔట్‌ చేశారు. హరితహారంలో భాగంగా ఆ వెంచర్‌లో మొక్కలు నాటారు. ఆ మొక్కలని గ్రామ పంచాయతీ కార్మికులు, ఉపాధి హామీ పథకం కూలీలు కలుపు తీస్తూ, మంచి ఏపుగా పెరిగేందుకు కృషి చేశారు. ఒక్కో మొక్క సుమారు 15 నుంచి 20 ఫీట్ల వరకు ఎత్తులో మంచి వృక్షంలా పెరిగాయి. అలాంటి చెట్లను నరికి వేశారు. చెట్లను నరికి వేసిన వ్యక్తులకు భారీగా జరిమానా వేసి మళ్లీ ఎవరు కూడా చెట్లను నరకకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయమై, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుదర్శన్‌ని వివరణ కోరగా.. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆ లేఔట్‌లో నరికిన చెట్లకు అటవీ శాఖ అధికారులచే పంచనామా చేయించి, అక్రమార్కులకు ఉన్నతాధికారుల సూచనతో తగిన పెనాల్టీ వేస్తామని, చట్టరీత్యా చర్యలు తీసుకొంటామని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు