Monday, May 20, 2024

46 మంది హిజ్రాల బైండోవర్‌

తప్పక చదవండి
  • ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు : సీఐ రాఘవేందర్‌
    మిర్యాలగూడ ; పట్టణంలోని ఒన్‌ టౌన్‌ స్టేషన్లో మంగళవారం ఇరు వర్గాలకు చెందిన హిజ్రాల గొడవ విషయంలో వన్‌ టౌన్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. నందిని, బాలమ్మ వర్గాలకు చెందిన 46 మంది హిజ్రాలపై సిఆర్పి 107 క్రింద కేసు నమోదు చేసి తాసిల్దార్‌ ఎదుట బైండవర్‌ చేశారు. వారికి సిఐ కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిజ్రాలు శుభకార్యాలు, నూతన వ్యాపారాల ఓపెనింగ్‌ లో, బిక్షాటన పేరుతో డబ్బు వసూలుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోడలపై, ఫంక్షన్‌ హాల్స్‌ వద్ద వర్గాల పేర్లు రాసి ఉంచిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోజు బలవంతపు వసూలకు పాల్పడుతునట్లు ఫిర్యాదులు అందుతున్నాయని అలా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వవద్దని, డబ్బులు ఇచ్చిన శిక్షార్హలు అని చెప్పారు. ఎవరైనా హిజ్రాలు డబ్బుల కోసం బలవంతం చేస్తే 100 ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ లు శ్రీను నాయక్‌, శివ తేజ్‌ తదితరులు ఉన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు