Monday, April 29, 2024

ఆదాబ్‌ హైదరాబాద్‌ కథనానికి స్పందన

తప్పక చదవండి
  • విద్యార్థులకు తప్పని తిప్పలు’’ కథనానికి స్పందించిన అధికారులు..
  • నేటి నుంచి పాఠశాల సమయానికి విద్యార్థులకు అందుబాటులోకి రానున్న బస్సులు
  • ఆ ఏరియాలో బస్సులు నడుపుతామన్న డీఎం..
    ఇబ్రహీంపట్నం : ఆదిభట్ల మున్సిపాలిటీ , యాచారం మండలం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సమస్యలు తీరాయి. ఇబ్రహీంపట్నం డిపో నుంచి వందలాది బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్తున్న బొంగులూరు నుంచి ఆదిభట్లలోని ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌ , ఆదర్శ పాఠశాల కు బస్సులు లేదంటూ ఈ నెల 19న ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’లో ‘‘విద్యార్థులకు తప్పని తిప్పలు’’ ?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది.ఈ విషయం ఆర్టీసీ అధికారులు పరిశీ లనలో కూడా వెలుగు చూసింది. దీంతో ఇబ్రహీంపట్నం డీఎం అశోక్‌ రాజు వెంటనే వెంటనే స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఇబ్రహీంపట్నం నుండి ఉదయం 8 గంటల 25 నిమిషాలకు బస్సు బయదేరుతుందని బొంగ్లుర్‌ మోడల్‌ స్కూల్‌ కి 8 గంటల 55 నిమిషాలకు చేరుకుంటుందని చెప్పారు. యాచారం మండలం నక్కర్త మేడిపల్లి పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు సరికొండ నుంచి పల్లె చెల్క తండా మీదుగా 7 గంటల 40 నిమిషాలకు బస్సు బయలుదేరి యాచారం మీదుగా ఇబ్రహీం పట్నం 9 గంటల 5 నిమిషాల కి చేరుకుంటుందని అన్నారు. నేటి నుంచి విద్యార్థుల పాఠశాల సమయనికి బస్సులు ఆ ప్రాంతాల్లో బస్సులు నడిపిస్తామని ఆయన అన్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు