Saturday, May 11, 2024

దంచి కొడుతున్న వానలతో జాగ్రత్త..

తప్పక చదవండి
  • కలెక్టరేట్‌లో 24/7 కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు..
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
  • ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి
  • టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి
    వికారాబాద్‌ జిల్లా: జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అందరూ అప్రపత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి తెలియజేశారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో గురువారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌ లో అధికారులను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజలకు పశువులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా గ్రామాలు మున్సిపాలిటీ లలో శిథిలావస్థలో ప్రమాదకరంగా ఉన్న గృహాలను గుర్తించి అందులో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు వెంటనే క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజలకు, ఎలాంటి ప్రమాదం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల కారణంగా రోడ్లపై నీళ్లు నిలవకుండా అన్ని మున్సిపల్‌ గ్రామ పంచాయతీల పరిధిలో మురికి కాలువలలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, వర్షపు నీరు సాఫీగా మురికి కాలుల గుండా ప్రవహించేలా చూడాలన్నారు. విద్యుత్‌ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్న చెట్లను గుర్తించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పరిశీలించుకుంటూ ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్‌ ప్రమాదాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. తప్పిదాల వల్ల ప్రమాదాలు జరిగినట్లయితే సంబంధిత అధికారులపై తీవ్ర చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్‌ హెచ్చరించారు. త్రాగునీరు కలుషితం కాకుండా మిషన్‌ భగీరథ ఇంజనీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి లీకేజీలను పరిశీలించుకోని, స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలని అన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా ప్రతిరోజు క్లోరినేషన్‌ చేసిన నీటిని సరఫరా చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరగకుండా వారికి ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు సలహాలను క్షేత్రస్థాయిలో ఉండి అందించాలని అన్నారు. పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి ఇంజనీరింగ్‌ అధికారులు ఎప్పటి కప్పుడు రోడ్లను పరిశీలించుకుంటూ నీటి ప్రవాహం వల్ల రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉన్నందున అట్టి ప్రాంతాల వద్ద వీఆర్‌ఏ, పోలీస్‌ కానిస్టేబుల్‌ లను ఏర్పాటుచేసి ప్రజలు అటువైపు వెళ్లి ప్రమాదాలలో చిక్కుకోకుండా 24/7 ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డ రోడ్లను వర్షం తగ్గిన వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించాలని అన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన చెరువుల సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉండి పరిశీలించుకోవాలని, చెరువులకు బుంగపడి కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంటే ఇంజనీరింగ్‌ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
    పాఠశాలల్లో జాగ్రత్తలు వహించాలి…
    ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం రెండు రోజుల సెలవు ప్రకటించినందున సెలవుల అనంతరం హెడ్మాస్టర్లు ముందస్తుగా పాఠశాలలను పరిశీలించుకున్న పిదప విద్యార్థులకు పాఠశాలలోకి అనుమతించాలని అన్నారు. ప్రమాదకరంగా ఉన్న పాఠశాలల నుండి విద్యార్థులను వేరే స్థలాలలో కూర్చోబెట్టాలని సూచించారు. విద్యార్థులకు మంచి మధ్యాహ్న భోజనంతో పాటు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వసతి గృహాలలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సంక్షేమ శాఖల అధికారులు ప్రమాదకరంగా ఉన్న వసతి గృహాలను గుర్తించి అందులో ఉండే విద్యార్థులను వేరే ప్రాంతాలకు తరలించాలన్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అధికారులందరూ పూర్తి బాధ్యతతో క్షేత్రస్థాయిలో ఉండి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శీతా సాయిలో చేపడుతున్న పనులు ఫోటోలు తీసి తన వాట్సాప్‌ కు పంపించాలన్నారు.
    కలెక్టరేట్లో24/7 కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు..
    భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ సహా యం కోసం 24/7 కాల్‌ సెంటర్‌ ను కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ అన్నారు. ప్రజలకు అత్యవసర సహాయం కోసం 7995061192 కు సంప్రదించి సా యం పొందాలన్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజలం దరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగ కుండా జిల్లా యంత్రాంగం పర్యవేక్షించడం జరుగుతుందని అన్నా రు. ఏమైనా సమస్యలు తలెత్తితే తక్షణ సహాయానికి కాల్‌ సెంటర్‌ నంబర్‌ కు ఎప్పుడైనా సంప్రదించవచ్చని తెలియజేశారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ( రెవెన్యూ ) లింగ్యా నాయక్‌, జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తాసిల్దారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు