Thursday, May 16, 2024

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలని నిరసన

తప్పక చదవండి
  • మోకాళ్లపై నిలబడి సీఎం కెసిఆర్ కు నాన్ టీచింగ్ ఉద్యోగుల విజ్ఞప్తి
    ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కే. చంద్రశేఖర్ రావు గారికి మోకాళ్లపై నిలబడి విజ్ఞప్తి చేశారు.ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా.వెంకటేష్, సూర్యచందర్, ఎడ్ల అంజయ్య గారు మాట్లాడుతూ మేము గత 25 సంవత్సరాలనుండి అతి తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించుకోలేక పోతున్నాము.పర్మినెంట్ కాకుండానే రిటైర్మెంట్ అవుతున్నాము.మాకు ఉద్యోగ భద్రత లేదు .మేము చనిపోయినా రిటైర్మెంట్ అయిన కానీ మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.కావున రాష్ట్రం లోని ఇతర శాఖలలో ఏవిదంగా అయితే రెగ్యులరైజ్ చేశారో మమ్మలిని కూడా రెగ్యులరైజ్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలు రోడ్డుపాలు కాకుండా చూడాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తుము అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలోడాక్టర్. వీరేశం,అభిలాష్, సంతోష్, సి.శ్రీనివాస్, సతీష్, మల్లికార్జున్, అరుణ్,అక్బర్,శ్రీకాంత్, వెంకటేష్, యారాల.రాజేష్, సురేష్ మొదలగువారు పాల్గొన్నారు
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు