Sunday, June 16, 2024

రాజకీయాలు ప్రజల కోసం చెయ్యాలి..

తప్పక చదవండి
  • మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య..

జనగాం : ఒత్తిడి ఆటంబాంబులతో కావచ్చు, ఆయుధాలతో కావచ్చు, తుపాకులతో కావచ్చు,కట్టెలతో కావచ్చు.. కానీ మానవీయ కోణంలో 200 సంవత్సరాల పరాయి బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి పొందించడానికి సత్యం, శాంతి, అహింస, సహాయ నిరాకరణ ఇవే ప్రపంచంలో మొదటిసారిగా ఆయుధాలుగా వాడుకోవడమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ నాలుగు అంశాలతో అనుకున్న లక్ష్యం వహించి నిరూపించిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ.. పాలన, ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సంక్షేమం , అభివృద్ధి ఇది ఒకవైపు.. రాజకీయాలు ప్రజల కోసం, ప్రాంతం కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడుచుకోవడం కోసం రాజకీయాలు మరో వైపు.. కానీ గత తొమ్మిది సంవత్సరాలుగా వీటికి తిలోదకాలు వదిలారు.. కేవలం రాజకీయాలతో ప్రజలని మోసం చేసే విధంగా దోచుకునే విధంగా బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే దేశాన్ని దోచుకొని పారిపోయారో, ఇప్పుడు పెట్టుబడుదారుల కోసం కొమ్ముకాస్తున్న కేంద్రం.. తెలంగాణ రాష్ట్రము అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని ప్రధాన మంత్రి, సాక్షాత్తు హోంమంత్రి చెప్పినా నివారణ చర్యలు తీసుకోకపోగా దాన్ని మరింత ప్రోత్సహించే విధంగా రాజకీయాలు చేస్తున్నారు.. రాజకీయాలు ప్రజల కోసం అనే మాట దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.. లేకపోతే రాజకీయాలు అవసరం లేదు.. ప్రాంతం కోసం ప్రజల కోసం రాజకీయాలు చెయ్యాలనే తపన కాంగ్రెస్ లో ఉంది.. అలాలేకుంటే అతి పేద దేశంగా మార్చిన బ్రిటీష్ పాలన నుండి 2014 వరకే ప్రపంచంలో కొనుగోలు శక్తిలో మూడవ ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగింది అని, సస్య విప్లవం ద్వారా స్వాతంత్రం వచ్చిన సమయంలో 37 కోట్ల మందికి కూడా అన్నం పెట్టలేని పరిస్థితుల నుండి 2014 వరకు 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను పండించడమే కాకుండా 130 దేశాలకు ఎగుమతి చేయడము, ప్రపంచంలో మొదటి సారిగా భారత దేశంలో 70 కోట్ల మందికి అత్యంత తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు సరఫరా చేసే స్థాయికి వచ్చింది. కానీ గంటలు, చప్పట్లు, దీపాలు వెలిగిస్తే ఈ స్థాయికి భారతదేశం రాలేదు.. పనిచేస్తే ఈ స్థాయికి భారతదేశం వచ్చింది అని ఆయన అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు