- అధికార పార్టీకి ఓటమి తప్పదన్న తుమ్మల
ఖమ్మం : ఖమ్మంలో అరాచకంపై బటన్ నొక్కి తీర్పు ఇవ్వాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కెసిఆర్ అవినీతి, అహంకార పూరిత పాలన పోవాలని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని, అందుఉకే కాంగ్రెస్‌ను గెలిపించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. తుమ్మలకు మద్దతుగా కురవి మండలం బలపాల గ్రామస్తులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ బలపాల గ్రామస్థులు అండగా ఉన్నారన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తనకూ.. రేణుకా చౌదరికి రాజకీయ జన్మ ఇచ్చారన్నారు. ఎన్టీఆర్ తనను మొదటి సారే వెంగళరావు కుటుంబంపై నిలబెట్టారన్నారు. నలబై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానంటే ప్రజాభిమానం కారణంగానేనని తుమ్మల పేర్కొన్నారు. వామపక్ష యోధులు ఉన్న జిల్లాలో గౌరవంగా రాజకీయాలు చేశానన్నారు. తన రాజకీయ లక్ష్యం గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్య శ్యామలం చేయడమేనన్నారు. అరాచక శక్తులు రాజ్యమేలుతుంటే అలాగే ఉండాలా? అని ప్రశ్నించారు. ఖమ్మం ఎన్నికపై కోట్లలో బెట్టింగ్‌లు సాగుతున్నాయని తుమ్మల పేర్కొన్నారు. సాధించుకున్న తెలంగాణాలో కేసీఆర్ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. దొరని గడీలోనే బంధించి శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హావిూ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాణ్యమైన సన్నబియ్యం ఇస్తామన్నారు. కేసీఆర్ దోపిడీని రోజూ ప్రశ్నిస్తున్నామని రేవంత్ రెడ్డిని, తనను ఓడిరచడానికి డబ్బుల సంచులు పంపిస్తున్నారని మండిపడ్డారు. విూరందరూ హస్తం గుర్తుకు ఓటేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించండని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిషరిస్తామన్నారు. డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని.. రాబోయేది ఇందిరమ్మ రాజ్యం అంటూ ధీమా వ్యక్తం చేశారు.