Saturday, May 18, 2024

కేరళకు కిక్కిచ్చిన ఓనం

తప్పక చదవండి
  • భారీగా మద్యం అమ్మకాలతో ఆదాయం
    తిరువనంతపురం : కేరళ రాష్టాన్రికి ఓనం పండుగ కిక్కిచ్చింది. రాష్ట్రంలో అతిపెద్ద పండుగ రావడంతో మలయాళీలు తెగ తాగేశారు. దీంతో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడు పోయింది . మద్యం విక్రయాల ద్వారా పది రోజుల వ్యవధిలోనే ఏకంగా చంద్రయాన్‌-3 బడ్జెట్‌ను మించిన ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరింది. కేరళ స్టేట్‌ బేవరేజ్‌ కార్పొరేషన్‌ డేటా ప్రకారం.. పండుగ సందర్భంగా 10 రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. సుమారు రూ. 759 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. అంతేకాదు ఆగస్టు 2023లో కేరళలో మొత్తం రూ.1799 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది పండగ సీజన్‌ తో పోలిస్తే ఈ ఏడాది 8.5 శాతం సేల్స్‌ పెరిగాయి. ఓనం పండుగ ఉత్రాదం రోజున రూ. 116 కోట్ల మద్యం విక్రయాలు నమోదయ్యాయి. నిధుల కొరతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఓనం పండుగ కలిసొచ్చిన్లటైంది. దీంతో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌ బ్జడెట్‌ను మించిన ఆదాయం మద్యం విక్రయాల ద్వారా సమకూరిన్లటైంది. చంద్రయాన్‌3 ప్రయోగానికి రూ.600 కోట్లు ఖర్చైనట్లు అంచనా. రాష్ట్రంలో మొత్తం 269 మద్యం విక్రయ కేంద్రాలుండగా.. అందులో ఒకటైన మలప్పురం జిల్లాలోని తిరూర్‌ ªరిళిని బెవ్‌కో అవుట్‌లెట్‌లో అత్యధిక విక్రయాలు జరిగాయి. ఇక త్రిసూర్‌ జిల్లాలో ఇరింజలకుడ మద్యం అమ్మకాల్లో రెండో స్థానంలో ఉంది. కేరళకు చెందిన ప్రముఖ రమ్‌ బ్రాండ్‌ ’జవాన్‌’ 10 రోజుల్లో 10,000 కేసులు అమ్ముడయ్యాయి. ఓనంకు ఒక రోజు ముందు.. అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగినట్లు డేటా ప్రకారం తెలుస్తోంది. ఆ ఒక్క రోజే 6 లక్షల మందికి పైగా బెవ్‌కో అవుట్‌లెట్‌ల నుంచి రూ. 120 కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇరింజలకుడ ఔట్‌లెట్‌లో సోమవారం అత్యధికంగా రూ.1.06 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. దీని తర్వాత కొల్లాంలోని ఆశ్రమం బెవ్‌కో ఔట్‌లెట్‌లో రూ.1.01 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కేరళ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఓనం . ఈ పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. మనకు సంక్రాంతి పండుగ ఎలానో మలయాళీలకు ఓనం అలా అన్నమాట. ఆగస్టుసెప్టెంబర్‌ నెలలో వచ్చే పండుగను పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటుంటారు. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓనం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కేరళలోని వ్యవసాయ పండుగ. ఇక ఈ పండుగను కేరళ ప్రజలే కాకుండా..తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్టాల్ర ప్రజలు కుడా ఏటా ఎంతో ఘనంగా జరుపు కుంటుంటారు. ఈ పండుగ సందర్భంగా కేరళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. ఏనుగుల స్వారీలు, తెల్లటి దుస్తుల్లో మగువలు, కరకాల పూలతో సుందరంగా చేసిన అలంకరణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలు రకరకాల పువ్వులను సేకరించి వాటితో ఇంటి ముందు అందమైన ముగ్గు వేసి ఆ మధ్యలో దీపం వెలిగిస్తారు. దీన్ని మలయాళంలో పూక్కలం అంటారు. ఓనం సందర్భంగా కేరళలో రంగవల్లులపై పోటీలు కూడా నిర్వహిస్తుంటారు.ఇక ఈ పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపై పలు రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తారు. సంప్రదాయ ఊరగాయలు, అప్పడాలు, పాయసం, పప్పు, అన్నంతోపాటు రకరకాల పిండివంటలను చేసుకుని కుటుంబమంతా కలిసి ఆరగిస్తారు. ఈ పండుగలో పూజలు, ముగ్గులు, పిండి వంటలే కాదు.. సంప్రదాయబద్ధమైన కట్టూబొట్టుకూ ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కసావు స్టైల్‌ చీరకట్టుకు ఈ పండుగలో ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారు వర్ణంతో మెరిసిపోయే ఈ చీరకు రంగురంగుల డిజైనర్‌ బ్లౌజుల్ని జతచేసి బుట్టబొమ్మల్లా ్గªరిసిపోతుంటారు కేరళ కుట్టీలు. ఈ ఏడాది కూడా మలయాళీలు ఓనం పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు