- వారిపై కబ్జాదారుల గుండాల దాడి, తీవ్రంగా గాయపడ్డ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వికాస్..
హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ భూములలో కబ్జా దారులు రాత్రి సమయంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అడ్డుకున్న ఏబీవీపీ విద్యార్థి నాయకులపై కబ్జా దారులు వారి రౌడీలు, గుండాల దాడి చేయగా పలువురు విద్యార్థి నాయకులకు గాయాలయ్యాయి. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వికాస్. భూఆక్రమణ దారుల గుండాల దాడిలో తీవ్రంగా గాయపడినా చికిత్స అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు ఏబీవీపీ చేపట్టిన ధర్నాలో మా ప్రాణాలైనా అర్పిస్తాం – మా ఓయూ భూములను రక్షించుకుంటాం అంటూ ఫ్లకార్డ్ తో ధర్నాలో పాల్గొన్న వికాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీకి ప్రారంభంలో 2400 ఎకరాల భూమి ఉండగా.. అనేక మంది కబ్జా కోరులు, భూ మాఫియా, రాజకీయ, ఇతర ప్రముఖుల కబ్జాలకు గురై నేడు అది కేవలం 1600 ఎకరాలకు పరిమితమైంది. ఉస్మానియా యూనివర్సిటీ భూమి ఒక్క అడుగు కూడా కబ్జా కాకుండా ఏళ్ల నుండి విద్యార్థి పరిషత్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇదే క్రమంలో నిన్న అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారన్న సమాచారంతో వెళ్లి ప్రశ్నించిన సమయంలో అధికారులకు లేని ఇబ్బంది మీకేంటని బయట నుండి గుండాలు రౌడీలను తెచ్చి మాపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ప్రభుత్వం యూనివర్సిటీ అధికారులు భూములపై సర్వే నిర్వహించి కబ్జా దారులను ఖాళీ చేయించి యూనివర్సిటీ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ ఝాన్సీ, స్టేట్ సంయుక్త కార్యదర్శి సురేష్, విభగ్ కన్వీనర్, స్టేట్ సంయుక్త కార్యదర్శి పృథ్వీ, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ శ్రీహరి, జీవన్, రాజు, మహేష్, శ్యామ్, శ్రీధర్, జిల్లా కన్వీనర్లు హరిప్రసాద్, కళ్యాణ్, ప్రతీక్, మనోహర్, యూనివర్సిటీ సెక్రెటరీ బట్టు పరుశురాం, స్టేట్ ఎక్జిక్యూటివ్ మెంబర్ కళ్యాణి, వైస్ ప్రెసిడెంట్ సాయి, గణేష్, కైలాష్, కోటి, సంపత్, పునీత్, రాజేష్, మహేష్, నరేంద్ర, విక్రమ్, సాయి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు…