Monday, May 20, 2024

నీళ్లు కాదు… విషం…

తప్పక చదవండి
  • అంతా చమురు వాసనే శ్రీ అసలేం కలుపుతున్నారు శ్రీ సింగరేణి నీటి సరఫరాలో వింతవాసన

సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని కార్మికుల కుటుంబాలకు అనునిత్యం మంచినీటి సరఫరాను చేస్తూనే ఉంటుంది. గౌతంపూర్‌, మిలీనియంకాలనీలలో కార్మికుల ఇళ్లకు మంచినీటి సరఫరా అనేది అనునిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నీటి సరఫరాలో ఒకలాంటి వాసన కార్మిక కుటుం బాలను ఆందోళనకు గురి చేస్తుంది. మంచినీటిని తాగలేని పరిస్థితి నెలకొందని కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నాయి. అసలు ఆనీటిలో ఏం కలుస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్మిక కుటుంబాలు. నీరు తాగాలంటే భయం భయంగా బతుకు ఈడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. గౌతంపూర్‌, మిలీనియం కాలనీలో నీటి సరఫరాలో ఒక వింతవాసన వస్తుందని ప్రచారం జోరుగా జరుగుతుంది. ఆవాసన ఆయిల్‌తో కూడిన విషవాయువుగా ప్రచారం జరుగు తుంది. నీరు సరఫరా అయ్యేటప్పుడు కొన్ని ముద్దలు నీటిలో వస్తున్నట్లు ఆదాబ్‌ హైదారాబాద్‌ పరిశీలనలో తేలింది.

ఆముద్దలు ఏంటనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. సింగరేణి కొత్తగూడెం ఏరియా అధికారులు నీటిసరఫరాలో నిర్లక్ష్యం వహిస్తుండటం వలనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుం టున్నాయి అన్నదానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. ఏరియాలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొనడంతో కార్మికులు, కార్మిక కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవు తున్నాయి. సరఫరా చేసేది నీరు ఒక లాంటి దుర్వాసన, ఆయిల్‌తో కూడిన వాసన రావడంతో కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురవుతు న్నాయి. ఇకనైనా ఆవాసన ఎక్కడి నుండి వస్తుందో లేదో తెలుసు కుంటారో లేదో వేచి చూద్ధాం. ఆదాబ్‌ హైదారాబాద్‌ గమనించిన విషయాల ప్రకారం ఇదొక గ్రీస్‌ వాసనగా గుర్తించడం జరిగింది. గ్రీస్‌వాసన ఎక్కడి నుండి వస్తుందో మరి అధికారులే తేల్చాలి. గతంలో అతిసారా సోకిన ప్పుడు కూడా ఇటువంటి సంఘనటలే చోటు చేసుకున్నాయి. ఏరియా ఉన్నతాధికారులు, సివిల్‌ అధికా రులు చర్యలు తీసుకుంటే కార్మిక కుటుంబాలకు ఎటువంటి ప్ర మాదం లేకుండా చూడొచ్చన్నవాదనలు వినిపిస్తున్నాయి సర్వత్రా. మరి ఆదిశగా అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూద్ధాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు