Monday, May 20, 2024

రాష్ట్రంలో పోలీసులకు ప్రమోషన్ల ఊసే లేదు..

తప్పక చదవండి
  • బీజేపీ అధికారంలోకి రాగానే అమలు చేస్తాం..
  • హామీ ఇచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్..
  • సరెండర్ లీవ్స్ అడిగితే సస్పెండ్ చేస్తామని బీ.ఆర్.ఎస్. బెదిరిస్తోంది..
  • కేసీఆర్ సర్కార్ వ్యవహార శైలిపై ఫైర్ అయిన బండి సంజయ్..

హైదరాబాద్, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పోలీసులకు సరెండర్ లీవ్ లతో పాటు టీఏలు, ప్రమోషన్లు ఇస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. పోలీసులకు ఇప్పటివరకు 8 టీఏలు ఇవ్వాలన్నారు బండి సంజయ్. ప్రమోషన్ల ఊసే లేదన్నారు. మెడికల్ అలవెన్స్ లు లేవన్నారు.. సరెండర్ లీవ్ లు అడిగితే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైల్లో వేస్తేనే ప్రమోషన్లు, పోస్టింగ్ లు ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోందన్నారు. జగిత్యాల జిల్లా మల్యాలలోని ముత్యంపేటలో బండి సంజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు.

ఇకపై బీఆర్ఎస్ నేతల వీపులు సాఫ్ చేయండి అని పోలీసులకు పిలుపునిచ్చారు బండి సంజయ్. ఈ ప్రభుత్వం ఉండేది 5 నెలలే అన్న బీజేపీ చీఫ్.. ఆ తర్వాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి అభ్యర్థులే లేరని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీలో ఎవరు గెలిచారో.. ఏ పార్టీకి అభ్యర్థులు లేరో అందరికీ తెలుసన్నారాయన. ప్రజలే తగిన బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు. ” కేసీఆర్ ప్రభుత్వం ఎందుకోసం దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారో చెప్పాలి? అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు తక్షణమే 10 వేల రూపాయలు ఇస్తానని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదు? వడ్లను కొనుగోలు చేసినా ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం పైసలివ్వలేదు. రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల రైతులను డిఫాల్టర్లను చేసిన దుర్మార్గులు.. బిడ్డ పెళ్లి కోసం, అప్పు కోసం బ్యాంకుకు పోతే అప్పు పుట్టడం లేదు. రైతులు ఏడుస్తున్నారు.

- Advertisement -

సొంత పైసలు బ్యాంకులో జమ చేస్తే ఆ డబ్బును వడ్డీ కింద జమ చేసుకుంటున్నారు. రైతులు అరిగోస పడుతున్నారు. వానాకాలం మొదలైనా పెట్టుబడి లేక అల్లాడుతున్నారు. 9 ఏళ్లుగా నష్టపోతూనే ఉన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న కేసీఆర్ కి.. రైతులను ఆదుకోవడానికి మాత్రం చేతగావడం లేదు. రైతులను నట్టేట ముంచిన మూర్ఖుడు, సిగ్గు లేకుండా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ గప్పాలు కొడుతున్నాడు. కేసీఆర్ చెక్ బౌన్సర్. పంజాబ్ రైతులకిచ్చిన చెక్కులతో పొరుగు రాష్ట్రాల ప్రజలు తెలంగాణను చూసి నవ్వుకుంటున్నారు. దళితబంధులో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్ తీసుకుంటే.. కేసీఆర్ కుటుంబం మరో 30 శాతం కమీషన్ తీసుకుంటోంది. కారు-సారు-60 పర్సంట్ సర్కార్ కేసీఆర్ ది. అయినా సిగ్గు లేకుండా తెలంగాణ రన్ నిర్వహిస్తున్న కేసీఆర్ ను రైతులే ఉరికించి కొట్టేరోజులు రాబోతున్నాయని హెచ్చరించారు.. తెలంగాణలో బీజేపీ అధికారంలో లేకపోయినా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరిస్తోంది. నరేంద్రమోదీ పేదల మనిషి. అందుకోసమే పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్నారు. మోదీ ప్రభుత్వమే పండించిన ప్రతి గింజ కొంటోంది. సుతిలీ తాడు, రవాణ, లేబర్ ఛార్జీలు సహా ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను గ్రామాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ మోర్చా నేతలపై ఉంది. రాబోయే 20 రోజులు పూర్తిస్థాయిలో సమయం వెచ్చించి ఇంటింటికీ వెళ్లి మోదీ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలి” అని బండి సంజయ్ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు