Sunday, October 13, 2024
spot_img

తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదు..

తప్పక చదవండి
  • అందుకే సీబీఐని ఆశ్రయించాను..
  • ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్..

న్యూఢిల్లీ, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యపై ఆరిజన్ డెయిరీ ఉద్యోగి శేజల్ సోమవారం నాడు సీబీఐ ఫిర్యాదు చేశారు.. దాదాపు పది రోజులకు పైగా ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్ న్యూఢిల్లీలోనే ఉంటున్నారు. కాగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమె ధర్నాకు దిగారు. జాతీయ మహిళా కమిషన్ కు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేశారు.. తనకు న్యాయం జరగడం లేదని ఆవేనదతో న్యూఢిల్లీలోనే ఆత్మాహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను స్థానికులు అప్రమత్తమై ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి నుండి ఇటీవలనే ఆమె డిశ్చార్జ్ అయ్యారు.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులపై ఆరిజన్ డెయిరీ ఉద్యోగి శేజల్ జాతీయ మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.. ఈ ఫిర్యాదుపై విచారణకు జాతీయ మహిళా కమిషన్ ఈ నెల 8వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. 15 రోజుల్లో విచారణ నివేదికను పంపాలని ఆదేశించింది. తాజాాగా ఆమె ఎమ్మెల్యేపై సీబీఐకి కూడ ఫిర్యాదు చేశారు.. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… పోలీసులకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే మ్యానేజ్ చేస్తున్నారని ఆరోపించారు. అందుకు సంబందించిన ఆధారాలను సీబీఐకి ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ పోలీసు దర్యాప్తుపై నమ్మకం లేకే సీబీఐని ఆశ్రయించినట్లు చెప్పారు. పారదర్శకంగా దర్యాప్తు చేయాలనీ సీబీఐని కోరామన్నారు. ‘‘నాపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. నా దగ్గర ఉన్న ఆడియో టేప్స్, ఇతర ఆధారాలను సీబీఐకి అందజేశాం. సీబీఐ దర్యాప్తు చేస్తామని చెప్పింది. రైతులను మోసం చేస్తే ఢిల్లీకి ఎందుకు వస్తాం. మోసపోయిన రైతులు ఉంటే రావాలని కోరుతున్నా ఎవరు రావడం లేదు. ఇన్వెస్ట్‌మెంట్ చేసివాళ్లకు షేర్లు ఇచ్చాము, ఎమ్మెల్యే సపోర్ట్ ఇస్తామని చెప్పినందుకే ఆయనకు షేర్ ఇచ్చాము. దుర్గం చిన్నయ్యపై కేసు నమోదై విచారణ జరిపేంత వరకు ఢిల్లీలోనే ఉంటాం. బెల్లంపల్లి లోకల్ పోలీసులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చెప్పినట్టు అనుసరిస్తున్నారు. మా పై కేసులు పెడుతున్నారు, ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు. తెలంగాణ పోలీసులు సంప్రదిస్తే అన్ని అంశాలు వివరిస్తాను. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నాము.. వారే మాకు న్యాయం చేయాలి’’ అని బాధితురాలు శేజల్ వెల్లడించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వల్ల ఇబ్బందులకు గురవుతున్న మహిళలకు రక్షణ కలిపించాలని, తక్షణమే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించి, పార్టీ నుంచి తొలగించి కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యేపై తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు