Tuesday, September 10, 2024
spot_img

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎన్నికలు..

తప్పక చదవండి
  • జులై 4 న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన ఐఓఏ
  • రిటర్నింగ్ అధికారిగా జమ్ము కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
  • ఫెడరేషన్ ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం..
  • బ్రీజ్ భూషణ్ పై ఆరోపణల నేపథ్యంలో
    ఆసక్తికరంగా ఎన్నికల నిర్వహణ..

గత కొన్నిరోజులుగా ఖాళీగా ఉన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎన్నికలు నిర్వహించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ ఎన్నికను జులై 4న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన అన్ని రకాల చర్యలను ఇప్పటికే భారత ఒలింపిక్‌ సంఘం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఉండాలని జమ్మూ కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. మరో వైపు.. తమకు న్యాయం జరిగే వరకు ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనేది లేదని రెజ్లర్లు తేల్చి చెప్పారు.

ఈ డబ్లూఎఫ్ఐ ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా జమ్ముకశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌ కుమార్‌ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నియమించింది. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ రాసింది. డబ్ల్యూఎఫ్‌ఐ కార్యనిర్వాహక కమిటీ ఎన్నికలను నిర్వహించేందుకు ఐఓఏ నిర్ణయించిందని.. దాని కోసం రిటర్నింగ్‌ అధికారిగా ఉండాలని. .జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌ కుమార్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. ఈ డబ్లూఎఫ్ఐ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మిగితా అధికారులు, సిబ్బందిని తోడుగా అందిస్తామని లేఖలో పేర్కొంది.

- Advertisement -

డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్ సింగ్‌పై.. రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేయడంతో రంగంలోకి దిగిన ఐఓఏ.. డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను రద్దు చేసింది. దీంతో డబ్లూఎఫ్ఐ కార్యకలాపాల నిర్వహణను అడ్‌హక్‌ కమిటీకి అప్పగించింది. ఈ సందర్భంగా 45 రోజుల్లోగా డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు పూర్తయి.. కొత్త ప్యానెల్ ఏర్పడుతుందని అడ్‌హక్‌ కమిటీకి తెలిపింది. ఇందులో భాగంగానే డబ్యూఎఫ్ఐకి కొత్త కార్యవర్గాన్ని నియమించేందుకు ఐఓఏ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ కేసులో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన నివేదికను.. ఢిల్లీ ట్రయల్‌ కోర్టుకు గురువారంలోగా ఢిల్లీ పోలీసులు అందించాల్సి ఉంది. మరోవైపు.. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు.. ఈ కేసులో తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని రెజ్లర్లు తేల్చి చెప్పారు. లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోకపోతే.. ఈ ఏడాది జరిగే ఏషియన్ గేమ్స్‌ను బాయ్‌కాట్ చేస్తామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పోటీల్లో పాల్గొనేదే లేదని తేల్చి చెప్పారు. సమస్యల పరిష్కారానికి జూన్ 15 వరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సమయం ఇచ్చారని.. తర్వాత ఏం చేయాలన్న దానిపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. తాము రోజు రోజుకూ మానసికంగా ఎంత తీవ్రంగా బాధపడుతున్నామో ప్రభుత్వానికి అర్థం కావడం లేదని ఆరోపించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు