Sunday, May 19, 2024

మార్కెట్లోకి ట్రెండ్ ఫోల్డబుల్‌ స్మార్ట్ ఫోన్‌లు..

తప్పక చదవండి

ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట కొన్ని లీక్స్‌ వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్‌లో వీ ఫ్లిప్‌లో సర్క్యూలర్‌ కవర్‌ డిస్‌ప్లేను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో రెండు కెమెరాలను అందించనున్నారు. ముందు భాగంలో పంచ్‌ హెల్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ…
టెక్‌ మార్కెట్‌లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్‌ విడుదలవుతూ యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది. స్మార్ట్ ఫోన్‌ తయారీలో ఇప్పటి వరకు ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి. తాజాగా మార్కెట్లో నడుస్తోన్న ట్రెండ్ ఫోల్డబుల్‌ స్మార్ట్ ఫోన్‌లు. ఇప్పుడంతా మడతపెట్టే ఫోన్‌లదే హవా. సామ్‌సంగ్‌ నుంచి మొదలు చాలా వరకు బ్రాండ్స్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టెక్నో కంపెనీ ఫాంటం వీ ఫోల్డ్‌ పేరుతో చవకైన ఫోల్డ్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫోల్డబుల్‌ స్మార్ట్ ఫోన్‌ ఇదేనని చెబుతున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన సింగపూర్‌లో జరిగే ఫ్లిన్‌ ఇన్‌ స్టైల్ టెక్నో ఫ్లాగ్‌షిప్‌లో ప్రొడక్ట్‌ లాంచ్‌ 2023 ఈవెంట్‌లో టెక్నో ఫాంటం వీ ఫ్లిప్‌ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ భారత్‌లో ఎప్పుడు లాంచ్‌ కానుందన్న దానిపై అధికారిక ప్రకటన రాలేదు.
ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట కొన్ని లీక్స్‌ వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్‌లో వీ ఫ్లిప్‌లో సర్క్యూలర్‌ కవర్‌ డిస్‌ప్లేను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో రెండు కెమెరాలను అందించనున్నారు. ముందు భాగంలో పంచ్‌ హెల్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో పని చేయనుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేయనుంది.
ఇక స్క్రీన్‌ విషయానికొస్తే ఇందులో ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్‌, 13 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాలను అందించారు. సెల్ఫీల కోసం 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. చార్జింగ్ విషయానికొస్తే ఇందులో 45 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు.
ఇక ధర విషయానికొస్తే ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 50 వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌లలో తక్కువ బడ్జెట్‌ ఫోన్‌ ఇదేనని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ప్లస్‌ జెన్‌ 1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇందులో 8.03 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ ఇన్నర్‌ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 6.53 ఇంచెస్‌ కవర్ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. 50 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్ ఈ ఫోన్‌ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు