Thursday, May 16, 2024

ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ బదిలీ..

తప్పక చదవండి
  • ఆదాబ్ ఎఫెక్ట్…
  • తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కమీషనర్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల దుమారం..
  • నవీన్ మిట్టల్ పై హైకోర్టు లో వందలాది కేసులు వేసిన బాధిత ఉద్యోగులు
  • హైకోర్టులో 33 కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన విషయాన్ని బయట పెట్టిన “ఆదాబ్”
  • స్పందించిన ప్రభుత్వం.. నవీన్ మిట్టల్ ను తప్పించి,. వాకాటి కరుణ నియామకం
  • నవీన్ మిట్టల్ బదిలీపై బాధిత ఉద్యోగుల సంబరాలు..

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణ ఉన్నత విద్యాశాఖ, కాలేజియెట్, కమిషనర్ కార్యాలయంలో అనేక అవినీతి ఆరోపణల దిమారం చిలికి చిలికి గాలి వానగా మారింది. నిన్నటి వరకు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ బ్యూరోక్రాట్ నవీన్ మిట్టల్ ఆగడాలపై అనేకమంది బాధిత ఉద్యోగులు హైకోర్టులో వందలాది కేసులు వేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా హైకోర్టులో నవీన్ మిట్టల్ పై 33 కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన విషయాన్ని జూన్ 10వ తేదీన “ఆదాబ్” సంబంధిత కేసు నెంబర్లతో సహా ఆధారాలు బయట పెట్టిన విషయం విధితమే. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి, సదరు శాఖ నుండి నవీన్ మిట్టల్ ను తప్పించి, ఈయన స్థానంలో కమిషనర్ గా వాకాటి కరుణను నియమిస్తూ ప్రభుత్వము శనివారం జీవో జారీ చేసింది (జీ.ఓ.ఆర్.టి.నెం.868, తేదీ.17-06-2023).

కాలేజియేట్ కమిషనర్ కార్యాలయంలో గడచిన సంవత్సర కాలంగా రాచరిక పరిపాలన కొనసాగుతూ వస్తోందని, ప్రశ్నించిన ప్రతి ఉద్యోగిని సస్పెండ్ చేయడం లేదా సర్వీస్ నుండి రిమూవల్ చేయడం లాంటి రాజ్యాంగ విరుద్ధమైన వికృత నిర్ణయాలు తీసుకొని, వందలాదిమంది ఉద్యోగులను బలిపీఠంపై ఎక్కించి వారి జీవితాలతో చెడుగుడులాడిన నవీన్ మిట్టల్ అనే సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారిపై బాధిత ఉద్యోగులు సవాల్ చేస్తూ హైకోర్టులో అనేక కేసులు గెలిచి మళ్ళీ తమ ఉద్యోగాలు సాధించుకున్న సంఘటనలు ఇక్కడ అనేకం. ఒక శాఖ ఉన్నతాధికారి బదిలీ అయి, వెళుతుంటే సాధారణంగా ఆ అధికారిని సదరు ఉద్యోగులు ఘనంగా సత్కరించి, సాగనంపడం సర్వసాధారణం, సహజం. కానీ ఇక్కడ ఈ విషయం తిరగబడింది. నవీన్ మిట్టల్ బదిలీ విషయం తెలుసుకున్న అనేకమంది భాదిత ఉద్యోగులు ఆయ జిల్లాల్లో స్వీట్లు పంచుకొని, టపాకులు పేల్చడం శోచనీయం.

- Advertisement -

శుభ పరిణామం..

నవీన్ మిట్టల్ బదిలీ కావడం అనేకమంది బాధిత ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈయన బదిలీని మేము శుభ పరిణామంగా భావిస్తున్నాము. నవీన్ మిట్టల్ అవినీతి ఆరోపణలపై నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్, డి.ఓ.పి లో పదుల సంఖ్యలో ఈయనపై ఫిర్యాదులు చేశాం. అన్నీ రకాల ప్రయత్నాలు ఫలించినట్లుగా భావిస్తున్నాం. అదే సమయంలో “ఆదాబ్” బయటపెట్టిన కోర్టు ధిక్కరణ కేసుల విషయం కూడా ఒక అస్త్రంగా పని చేసింది. నవీన్ మిట్టల్ నన్ను మూడుసార్లు సస్పెండ్ చేసి, సర్వీస్ రిమూవల్ చేస్తే, న్యాయస్థానంలో పోరాటం చేసి నా ఉద్యోగం నేను సాధించుకున్నాను.

  • కర్రోళ్ళ బుచ్చయ్య,
    అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసా
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు