Wednesday, May 15, 2024

గిరిజనులను రారాజులు చేసిన ఘనత కేసీఆర్ దే..

తప్పక చదవండి
  • హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు,
    రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం గుండ్రాతి శారదాగౌడ్..
    హైదరాబాద్ : సీఎం కెసిఆర్ గిరిజనులను రాజులను చేసాడు.. వారిని కేవలం గిరికి, పుట్టలకు పరిమితం చేయలేదు సగర్వంగా నేడు తల ఎత్తుకునేలా మా తండాలలో మా పాలన, స్వపరిపాలన చేసుకునేలా 3,146 గిరిజన తండాలను, గూడాలను గ్రామ పంచాయతీ హోదా ఇచ్చి రారాజులను చేసిండ్రు అన్నారు గుండ్రాతి శారదాగౌడ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం.

నగరం నడిబొడ్డున సేవాలాల్ బంజారాభవన్,కట్టించిన ఘనత కెసిఆర్ దే.. కొమరం భీమ్ ఆదివాసీ భవన్ ఆత్మగౌరవభవన్ కట్టారు.. అంతేకాదు సీఎం కెసిఆర్ వారికీ సంక్షేమ ఫలాలతో పాటు సామజిక ఆర్థిక హోదా పెరగాలి అంటే చదువు ఉద్యోగాలలో కూడా గిరిజన బిడ్డలకు ప్రోత్సాహం ఇవ్వాలనే సదుద్దేశంతో విప్లవాత్మక నిర్ణయం తీసుకొని విద్యా ఉద్యోగ రంగాలలో 6 శాతం నుంచి 10 శాతం రిజర్వేషన్స్ పెంపు చేయడం జరిగింది.. అలాగే 161 రెసిడెన్సీయల్ పాఠశాలలు, 118 రెసిడెన్సీయల్ జూనియర్ కాలేజీలు, 22 డిగ్రీ కాలేజీలు, విదేశీ విద్యకు 20లక్షల అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్పులు, అలాగే ఎస్టీ పారిశ్రామికవేత్తలకు టీ ఎస్ -ప్రైడ్ ప్రోత్సాహం, ఇప్పటివరకు 13,264 ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ప్రోత్సాహం కల్పించింది.. ఇది తెచ్చుకున్న నా తెలంగాణా ఇచ్చిన సగర్వ బహుమతి గిరిజన బంధావులకు, కెసిఆర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాల ఫలితాలు అన్నారు గుండ్రాతి శారదాగౌడ్. ఈ కార్యక్రమంలో మున్ని, ముత్యాలు, సత్య పాల్గొన్నారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు