పువ్వు పుడుతూనే పరిమళంతో పుడుతుంది.వికసించే కొద్దీ దాని పరిమిళం పరిమితి పెరుగుతుంది. చైత్రం తన ప్రవేశంతోనే ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. ఈ పరిణామ క్రమ మంతా గతితార్కికతను అనుసరించే నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక ప్రజలతోపాటు నాయకత్వ త్యాగమే స్వయంపాలనను తెచ్చింది.ఉద్యమ రథసారధిగా నాడు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టిన పోరాట సారమే వర్తమాన కాలంలో ముఖ్యమంత్రిగా మరిన్ని బాధ్యతలు పెంచింది.ఈ క్రమంలో దశాబ్ది తెలంగాణ స్వయంపాలన తెలంగాణ ఒక రాష్ట్రంగా నిలబెట్టడమే కాదు, ఓ నవతరం నాయకత్వాన్ని తెలంగాణ కోసం కేటీఆర్ ను తీర్చిదిద్దింది.ఇప్పుడు హ్యాట్రిక్ కోసం యువ నాయకత్వం తన రాజకీయ చాణక్యత, పాలనను రంగరించి పార్టీ పటిష్టతకు కోసం కాలికి గజ్జెకట్టి పోరుకు సిద్ధం అయ్యారు. ఉద్యమ నేత బీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి ఒక వన్నె తెచ్చారు. 60లక్షల బీఆర్‌ఎస్ సైన్యానికి అన్ని తానై పరిపక్వతగల నాయకుడిగా, పరిపాలకుడిగా రాణించి కేసీఆర్ వారసుడుగా తన సామర్థ్యాన్ని నిరూపించు కున్నారు. ఉద్యమ కాలం నుంచి కేటీఆర్ స్వయంగా ఎదిగేందుకు కృషి చేసారు. తెలంగాణ జాతిపిత అడు గుజాడల్లో కీలక భూమిక పోషించి తెలంగాణ పొద్దుగా నిలిచారు. తెలంగాణ ప్రధాత కలలుకన్న బంగారు తెలంగాణ పునర్నిర్మాణం లో ఐటీ ఏ కేటీఆర్ అన్నట్లుగా, పార్టీ భవిష్యత్ కు మూలస్థంభంగా తండ్రికి తగ్గ తనయుడిగా అందరి మన్ననలు పొందారు. అమెరి కన్ రచయిత ‘జాన్ కాల్విన్ మాక్స్వెల్’ సంబోధిం చినట్లు నాయ కుడు అంటే మార్గం తెలిసినవాడు, మార్గంలో వెళ్ళే వాడు, మార్గం చూపేవాడు.. అన్ని సుగుణాలున్న నవతరం నేత కేటీఆర్. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ఆయనది ఒక నవశకం. తనకు ఉన్న అపారమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియో గిస్తూ, దేశ తలసరి ఆదాయంలో నెంబర్ వన్‌గా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తండ్రికి, చేదోడు వాదోడుగా నడిపిం చడంలో సఫలీకృ తులైనారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో సుదీర్ఘ పాలనను భవం, రాజకీయ పరిజ్ఞానం ఉండి, తలలు పండిన నాయకత్వం చేయ లేని అభివృద్ధి కేవలం తొమ్మిదేండ్లలో చేసిన పని రాక్షసుడికి మం చి నాయకుడికి ఉండే లక్షణాలు అన్ని ఉన్నాయి. ఐటీ రంగం లో తొమ్మిదేండ్లలో టీఎస్ ఐ పాస్ ద్వారా దాదాపు రూ.22,700 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. 2014లో 3.23 లక్షల నుంచి 2023 తొమ్మిది లక్షలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది.ఐటీ ఎగుమతులు 57 వేల కోట్ల నుండి 2.50 లక్షల కోట్లకు పరుగులు తీసింది.ఐటీ రంగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని ఐటీ ఉద్యో గాల్లో ప్రతి మూడిరట ఒక ఉద్యోగం మనదే కావడం విశేషం. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న మొక్కను దారిన వెళ్లే మేక కూడా తిని పారేయ గలదు. కానీ అది పెరిగి బలమైన కాండంగా, మహా వృక్షంగా మారితే ఏనుగును కూడా దానికి కట్టి పడేయగలము. ఇప్పుడు తెలంగాణ ఐటీ రంగం కేటీఆర్ నాయకత్వంలో పాతుకు పోయింది. కరోనా కష్ట కాలంలో ట్విట్టర్ వేదికగా ఎవరు సహాయం అడిగినా ‘నో’ అన కుండా స్పందించిన కరుణా మయు డుకుపొరుగు రాష్ట్రాల్లో సైతం జేజేలు కొట్టుతారంటే అతిశయోక్తి కాదు.తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రస్థానంలో తీర్చిదిద్దుతా మన్నప్పుడు హేళనచేసిన ప్రత్యర్థులు ఇప్పుడు పెదవి విరవక తప్పడం లేదు. దేశ ఐటీ రంగంలో అగ్రస్థానంలో దూసుకు పోతు న్నది. అందుకు 2022-23 వార్షిక నివేదిక నిలువెత్తు నిదర్శనం. కేటీఆర్‌కు ఉన్నముందు చూపు కఠోర శ్రమ జాతీయ, అంతర్జా తీయ సంస్థలు హైదరాబాద్ క్యూ కట్టడానికి కారణమైందనేది జగ ద్విదితం. ‘‘ఒక గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తులను ఆకర్షిస్తాడు ‘జోహాన్ వోల్ఫ్గ్యాంగ్’ జర్మన్ కవి అన్నట్లుగా తన ప్రతిభతో దేశ,విదేశాలకు తెలంగాణ గొప్పతనాన్ని చాటి పేరొందిన టెక్నోక్రాట్‌గా రాటుదేలి ప్రపంచ నాయకులను ఆకర్షించే స్థాయికి ఎదగడం కేటీఆర్‌తో సాధ్యంఅయ్యింది.ఉప్పెనలా సాగుతున్న తెలంగాణ ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలు వాలని విదేశాల్లో కార్పొరేట్ జీవి తాన్ని వదులుకొని ప్రజా ఉద్య మంలో క్రియాశీలక పాత్ర పోషించి నేటి యువ తరానికి ఆదర్శంగా నిలిచారు. తెలం గాణ అస్తిత్వ పోరాటం కవులు, కళాకా రులను తయారు చేసినట్టే కేటీఆర్ నాయకత్వంలో నవతరానికి సరితూగే నాయకులను ఉత్పత్తి చేసినారు. తెలం గాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ఆందోళనలలో భాగస్వా మ్యం, పాలనలో పరిపక్వత, నిత్యం జనంతో మమేకమయ్యి జనహృదయ నేతగా తెలంగాణ పార్టీకి దారి దీపం కేటీఆర్. కేసీఆర్ మేధస్సును,జ్ఞాన సంపదకు నిజమైన వారసుడుగా వేలు చూపితే కొండబాకే యువ నేత, సాటిమనిషి పట్ల మానవీయతను చాటే గొప్ప హృదయం ఉన్న నేత.తెలుగు, ఇంగ్లీష్, హిందీ మత్తడి దుంకినట్లు మాట్లాడ కలిగే నైపుణ్యం ఆయన స్వంతం. సిరిసిల్ల నుంచి సిలికాన్ వరకు క్లాస్ నుంచి మాస్ పాలోయింగ్ ఉన్న గొప్ప మానవతావాది. అమృతోత్సవ కాలంలో తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిన యువ రాజకీయవేత్త కేటీఆర్ భవిష్యత్ తరాలకు భరోసా,వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించిన సదస్సుల్లో దేశ కిరీటాన్ని నిలిపి ప్రపంచ వేదికలపై తెలంగాణ శాందార్‌గా నిలిచింది.తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణపెవిలియన్’ సెంటర్‌ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. రాష్ట్ర భౌగో ళిక స్వరూపంతో పాటు తొమ్మిదేండ్లలో అన్ని రంగా ల్లో సాధించిన ప్రగతి ,పెట్టు బడులు, పారిశ్రామిక, ఐటీ దాని అనుబంధ రంగాల్లో చేపట్టిన టీ హబ్ కార్యక్రమాలను నిపుణులు ఆసక్తిగా తిలకిం చారు. ప్రపంచ వేదికల్లో యువనేత కేటీఆర్ కనబర్చిన ప్రావీణ్యత ముగ్దులను చేసిందంటే అతిశయోక్తి కాదు.