న్యూఢిల్లీ : ట్విట్టర్‌కు పోటీగా మెటా తీసుకొచ్చిన థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లో యూజర్ల యాక్టివిటీ 70 శాతం పడిపోయిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది. ఈ ఏడాది జులై 7 న థ్రెడ్స్‌లో డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య పీక్‌కు చేరుకోగా, ఆ లెవెల్ నుంచి ప్రస్తుతం 70 శాతం తగ్గి 13 మిలియన్ యూజర్లుగా రికార్డయ్యింది. ఈ నెల 5 న థ్రెడ్స్‌ను మొదటిసారిగా లాంచ్ చేశారు. లాంచ్ అయిన కొన్ని గంటల్లోనే 100 మిలియన్ యూజర్లు రిజిస్టర్ చేసుకున్నారని కంపెనీ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ పేర్కొన్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం, థ్రెడ్స్ ఐఓఎస్, అండ్రాయిడ్ యాప్‌లలో యూజర్లు గడుపుతున్న సగటు సమయం 19 నిమిషాల నుంచి నాలుగు నిమిషాలకు పడిపోయింది. యూఎస్‌లో థ్రెడ్స్ అండ్రాయిడ్ యాప్‌లో యూజర్లు గడుపుతున్న సగటు సమయం పీక్ లెవెల్ 21 నిమిషాల నుంచి ఐదు నిమిషాలకు పడిపోయింది’ అని డిజిటల్ డేటా ఎనలిటిక్స్ కంపెనీ సిమిలర్ వెబ్ డేటాను కోట్ చేస్తూ వాల్‌స్ట్రీట్ రిపోర్ట్ పేర్కొంది. థ్రెడ్స్ మరింతగా విస్తరించడానికి చాలా చేయాల్సి ఉందని మార్క్ జూకర్‌బర్గ్ పేర్కొన్నారు. యూజర్లు కోరుతున్న చాలా ఫీచర్లను థ్రెడ్స్‌లో యాడ్ చేయాల్సి ఉందని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సెరి అన్నారు. బగ్స్ ఫిక్స్ చేయడంపై తమ టీమ్ పనిచేస్తోందని, త్వరలోనే ఎడిట్ బటన్, పోస్ట్ సెర్చ్, ఫాలోయింగ్ ఫీడ్ వంటి ఫీచర్లను థ్రెడ్స్‌లో యాడ్ చేస్తామని వివరించారు. కాగా, ట్విట్టర్‌ను జూకర్‌బర్గ్ కాపీ కొట్టారని, కేసు వేస్తామని ఎలన్ మస్క్ పేర్కొన్నారు.