Sunday, December 3, 2023

మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

తప్పక చదవండి
  • ఆ వార్తలన్నీ ఊహాగానాలే..
  • పీ.ఐ.హెచ్. యూనిట్ నిర్మాణానికి ఈ నెల 8న శంఖుస్థాపన చేయనున్న ప్రధాని..
  • బీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్..
  • అయోధ్యాపురం పరిసర ప్రాంతాల్లో కిషన్ రెడ్డి బృందం పర్యటన..

విభజన హామీల్లో ఒకటైన కోచ్ ఫ్యాక్టరీకి ప్రత్యామ్నాయంగా పీ.ఓ.హెచ్. యూనిట్ నిర్మాణానికి ఈ నెల 8వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. ఈక్రమంలో అయోధ్యపురం పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదిత భూములను కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా పలువురు బీజేపీ నేతల బృందం సందర్శించారు. ఇందుకోసం ఇప్పటికే 160 ఎకరాల స్థలాన్ని రైల్వేశాఖకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. మోదీ వరంగల్ పర్యటన ద్వారా ఉత్తర తెలంగాణలో పట్టుకోసం వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఈ క్రమంలో తెలంగాణ అభివృద్ది కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీన ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటనపై బీజేపీ నేతలతో కలిసి ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించి.. మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశానికి ఈటలతో పాటు బండి సంజయ్‌ తదితరులు హాజరయ్యారు. ఘట్కేసర్‌ నుంచి రాయగరి వరకు ఎం.ఎం.టి.ఎస్. కొత్త రైల్వే లైన్‌ నిర్మాణాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపడుతున్నట్టు ప్రకటించారు కిషన్‌రెడ్డి. అంతేకాకుండా వరంగల్‌లో వ్యాగన్‌ తయారీ కేంద్రం రైల్వే శాఖ నిర్మిస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదని.. ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం లేదని.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రనాయకత్వంలో మార్పులపై వస్తున్న వార్తలు ఊహాగానమన్నారు కిషన్‌రెడ్డి. పార్టీ నేతలంతా కలిసి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. 8న హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీలో బహిరంగ సభ జరగనుంది. జనసమీకరణ, సభ సక్సెస్‌ కోసం రంగంలోకి ముఖ్యనేతలు.. ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు