Saturday, May 18, 2024

కడెం ప్రాజెక్ట్‌ కట్టినోళ్లకు దండాలు..!

తప్పక చదవండి
  • స్వరాష్ట్రం తెలంగాణలో కడెం ప్రాజెక్ట్‌
    నిర్మాణంలో పాలుపంచుకున్నవారందరీని ఎవరూ తలువడం లేదు.ఇదే తెలంగాణ ఉద్యమ సమయంలోనైతే కడెం ప్రాజెక్ట్‌ గురించి కథనాలు,పాటలు వచ్చేవి.ఊరోడైన, పరాయి ఊరోడైన నల్లను నల్లనాలి.తెల్లను తెల్లనాలి. అదే నిజమైన సాహిత్యం, రాజకీయం,ప్రజాస్వామిక సౌథం.కాళోజీ మాటల్లో చెప్పాలంటే ‘ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం నుండి తన్ని తరిమేయాలి.ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర పెట్టాలి.ఇంకా భారతరత్న లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ మాటల్లో చెప్పాలంటే ‘‘’’ప్రభుత్వ శక్తీకి ప్రజాశక్తీ అనునిత్యం అంకుశంగా ఉంటే తప్పా ప్రజాస్వామ్యం బతుకదు.నిన్న జులై 27 2023 నాటి కడెం ప్రాజెక్ట్‌ ఉన్న 18 గేట్లలో 4 గేట్లు పైకి లేవకుండా మొరాయించిన గేట్లపై వరద నీరు పోతుంటే ప్రాజెక్ట్‌ కట్టినోళ్లకు దండాలు చెప్పాలనిపించింది. గోదావరికి ఉప నది అయిన కడెంపై 1958లో 67 టి.ఎం.సి (నిలువ ఉన్న నీటి పరి మాణమైన అడుగు పొడవు, అడుగు లోతు,అడుగు ఎత్తు వంద కోట్ల ఘనపుటడుగు నీళ్లను ఒక టి.ఎం.సి అంటారు)ల సామర్థ్య ంతో నిర్మించారు.దీనిని మొదటగా కండువ ఋషి పేరుతో పిలి చారు. తరువాత కాలంలో నివాళిగా కదం నారాయణ రెడ్డి డ్యామ్‌ గా అధికారికంగా ప్రకటించారు.కడెం డ్యామ్‌ నిర్మాణం సమయం లో కేవలం 9 వరద గేట్లను మాత్రమే నిర్మించారు. అయితే మరు సటి సంవత్సరం 1959 లో భారీ వరదల వలన కట్ట తెగిపో యింది. దానితో యుద్ధప్రాతిపదికన మరో 9 గేట్లను నిర్మించారు. కడెం ప్రాజెక్ట్‌ చిన్నదైనా తెలంగాణకు మంచినీళ్ల దాత.దాదాపు కడెం ప్రాజెక్ట్‌ ప్రతి వర్ష కాలం నిండుతుంది. గోదావరి నదిపై ‘ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నిర్మించిన పిదప కడెం ప్రాజెక్ట్‌ ప్రాముఖ్యత మరింత పెరిగింది.2014 లో కరువు వచ్చినప్పుడు కడెం గేట్ల నుండి ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ లకు వచ్చిన నీళ్లే హైదరాబాద్‌ వరకు లిఫ్ట్‌ ద్వారా తాగు నీరుగా సరఫరా అయినవి.ఇంకో ముఖ్య విష యం ఏమిటంటే? కడెం ప్రాజెక్ట్‌ మరియు కడెం నది పరీవాహక ప్రాంతంలో సగటు వర్షపాతం కంటే ఎక్కువగా వర్షించుతుంది. గడచిన 2022 జులై 11న కడెం డ్యామ్‌ లోకి 5 లక్షల క్యూసె క్కుల(నీటి ప్రవాహా వేగం క్యూబిక్‌ పీట్‌ ఫర్‌ సెకండ్‌ 28 లీటర్లు) ఇన్‌ ప్లో రాగ 3్న5 లక్షల క్యూసెక్‌ల నీళ్లు మాత్రమే అవుట్‌ ప్లోగా గేట్లనుండి దిగువకు ప్రవ హించినవి. అప్పుడు కూడా గేట్లు పైకి లేవడం మొరాయించినం దున జూలై 13 నాటి మధ్యాహ్నం వరకు ఎడమ కాలువ గేట్లపై నుండి, హరిత రిసార్ట్స్‌, పవర్‌ హౌస్‌ ప్రాంతంలో ఉన్న కట్టపై నుండి నీళ్లు పొంగి ప్రవహించినవి. తుదకు ఎడమ కాలువ మధ్య సహజంగా గండి పడి నీళ్లు దిగువకు ప్రవహించి నందున దిగువ ప్రాంత ప్రజలకు ఆస్తి నష్టం జరుగలేదు.కాని ముఖ్యమంత్రి తన తప్పిదాన్ని కప్పిపుచ్చు కోవడానికి ప్రగతి భవన్‌లో రివ్యూ మీటింగ్‌ పెట్టి ఆశాస్త్రీయమైన చర్యలకు పూనుకున్నాడు. తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్ర శర్మతో ఫోన్‌లో చర్చించాడు.వర్షాలు తగ్గేందుకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవా దాయ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే వర్షాలపై, వరద లపై వివాదస్పదమైన వాఖ్యలు చేసాడు. ‘క్లౌడ్‌ బరస్ట్‌’ (ఒక గంటలో మేఘాల విస్పోటనం ద్వారా ఒక ప్రదేశంలో 10 సెంటి మీర్లు అంతకంటే ఎక్కువ వర్షం కురియడం) అనే కొత్త పద్ధతి ద్వారా దేశంలో విదేశీ శక్తులు ఆకస్మిక వరదలు సృష్టిస్తున్నారని చెప్పాడు.గతంలో లడ్డాలో, లేహాలో, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌ వర్షాలు పడినట్లు గుర్తు చేశాడు. సరిగ్గా సంవత్సరం పిదప 2023 జులై 27న కడెం ప్రాజెక్ట్‌లోకి మరల భారీ వరద వచ్చింది. దాదా పు జులై 20 నుండి అల్ఫపీడన ప్రభావంతో రోజు వర్షాలు కురు స్తున్నవి. వాతావరణ శాఖ జాగ్రత్తగా ఉండాలని,వరదలు వస్తా యని హెచ్చరించుచునే ఉన్నవి.అయిన పేరెన్నిక పొందిన కేసీఆర్‌ పాలన ఏమి చేసిందో? ఏమి చేస్తుందో ప్రగతి భవనానికి,ఫామ్‌ హౌస్‌ కే పరిమితం అవుతున్నవి. కాని కడెం ప్రాజెక్ట్‌ కు మాత్రం అదే కష్టం.గేట్లు పైకి లేవకుండా మొరాయించడం,మరల దేవా దాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ,ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, అధికారులు ప్రాజెక్ట్‌ వరదను చూడడం,మైసమ్మకు మొక్కడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పడం రీపీటు అవుతోంది.జులై 27 నాటి మద్యాహ్నం వరకు ప్రాజెక్ట్‌ లోకి గరిష్ఠ నీటి మట్టం 700 అడుగులు దాటి 702.5 అడుగులకు చేరుకుంది. దాదాపు ఇన్‌ ప్లో 3.80 లక్షలకు చేరింది.మొత్తం 18 గేట్ల నుండి పోవలసిన వరద నీరు 14 గేట్ల నుండే ప్రవహిం చింది. మిగతా 4 గేటు పైకి లేవకుండా మొరాయించినవి. దాని తో అవుట్‌ ప్లో 2.5 లక్షల క్యూసెక్కుల అయినందున పైకి లేవని గేట్ల పైనుండి వరద ప్రవహించింది. జె.సి.బి తో మొరాయించిన గేట్లను పైకి లేపే ప్రయత్నాలు ఫలించ లేదు.కాని ఇన్‌ ప్లో వరద ఉధృతి తగ్గినందున రెండోసారి కడెం ప్రాజెక్ట్‌ విపత్తు నుండి బయట పడినాము.ఈ రోజు జులై 28 న కేంద్ర జల కమీషన్‌ సభ్యులు కడెం ప్రాజెక్ట్‌ సందర్శనకు వస్తున్నట్లుగా తెలిసింది. ప్రభుత్వం స్వరాష్ట్రంలో ధశాబ్ది తెలంగాణ ఉత్సవా లను జరిపింది.అందరూ కొట్లాడి సాధించు కున్న తెలంగాణ కాబట్టి అందరికీ సంబురమే.నాటి పది జిల్లాల తెలంగాణ నేడు 33 జిల్లాల తెలంగాణ అయింది.ముఖ్యమంత్రి మంచిగా ప్రగతి భవన్‌ కట్టించుకుని నివాసం ఉంటున్నాడు. కొత్త అసెంబ్లీ కట్టించాడు.స్వంతంగా 60 ఎకరాల్లో కట్టుకున్న పౌమ్‌ హౌస్‌కు మాటి మాటికి పోయి సేదతీరు తున్నాడు. విశాలమైన ఆదిలాబాద్‌ జిల్లాలో నేడు మంచిర్యాల, నిర్మల్‌,కొమురం భీమ్‌ అసిఫాబాద్‌ జిల్లాలు అయినవి. ఎమ్మెల్యేలు, కలెక్టర్‌లు పెరిగిర్రు. కాని ‘కడెం ప్రాజెక్ట్‌ను మంచిగా,పెద్దగా చేయకున్న పర్వాలేదు. ఉన్న ప్రాజెక్ట్‌ సురువుగానైన ఉంచుతే బాగుండేది. దెబ్బ తిన్న గేట్లను మరమ్మతులు చేయించడం లేదు.వరద ఉదృతిలో కొట్టుకుపోయిన వరద గేట్ల ‘కౌంటర్‌ వెయిట్లను అమర్చడం లేదు.తుప్పు పట్టిన వరద గేట్ల స్థానంలో కొత్త గేట్లను బిగించడం లేదు.గేట్లు సులువుగా పైకి లేవడానికి ఇరువైపుల ఉన్న ‘‘’’రూలర్స్‌ లకు కంప్రెషర్‌ తో గ్రీస్‌ కొట్టడం లేదు. మాములు రైతు అతివృష్టికి, అనావృష్టికి ఎదురీదుతూ బావులు కూలితే పూడిక తీసుకుంటు న్నాడు. వరదను దారి మళ్లించడానికి బర్మ్‌ గడ్డలు పోసుకుంటు న్నాడు. మోటార్‌లు మునిగితే పైకి గుంజుకుంటు న్నాడు. వరద కోతకు గురైన భూమిని మరల చదును చేసుకొని సాగు చేస్తున్నాడు.అరవ కష్టం చేసి అన్నం పెడుతున్నాడు.కాని ప్రభుత్వ పాలకులైన ముఖ్యమంత్రి, మంత్రులు,ఎమ్మెల్యేలు, బ్యురాక్రసీ/ యంత్రాంగం అందరూ ప్రజల పన్నులతో సకల సౌక ర్యాలతో విధులను నిర్వహించుచున్నారు. మీకు పాలన పరమైన, ఆర్ధిక పరమైన ఎటువంటి ఇబ్బందులు లేవు.అటువంటప్పుడు మీరెం దుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో జవాబు చెప్పాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు..రెండు సార్లు వరద ఉదృతి నుండి ఎటు వంటి నష్టం లేకుండా గట్టెక్కించిన, కడెం ప్రాజెక్ట్‌ కు కట్టి నోళ్లకు గుండెల్లో దండాలు పెట్టుకుంటున్నారు. కృతజ్ఞతలతో,
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు