Monday, September 9, 2024
spot_img

చెన్నైలో జీ 20 ఎన్విరాన్‌మెంట్‌, క్లైమేట్‌ సస్టైనబిలిటీ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం..

తప్పక చదవండి

చెన్నై: భారత జి20 అధ్యక్షతన ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్లైమేట్‌ సస్టైనబిలిటీ వర్కింగ్‌ గ్రూప్‌ (ఇసిఎస్‌డబ్ల్యుజి) మంత్రుల సమావేశం శుక్రవారం చెన్నైలో ప్రారం భమైంది. వీడియో సందేశం ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ‘యుఎన్‌ క్లైమే ట్‌ కన్వెన్షన్‌’, ‘పారిస్‌ ఒప్పందం’ ప్రకారం కట్టుబాట్లపై చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పర్యావరణ, వాతావరణ స్థిరత్వ వర్కింగ్‌ గ్రూప్‌ కింద రెండు రోజుల చర్చల తర్వాత ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్‌ అధ్యక్షతన జరిగింది. 4వ ఈ.సి.ఎస్‌.డబ్ల్యు.జీ. సమావేశంలో పర్యావరణం, వాతావరణంపై రెండు వేర్వేరు ట్రాక్‌లు సృష్టించబడ్డాయి. పర్యావరణ ట్రాక్‌ కింద, నీటి వనరుల నిర్వహణపై చర్చించగా, క్లైమేట్‌ ట్రాక్‌ కింద, వాతావరణ మార్పుల అంశంపై ప్రతినిధులు అభిప్రా యాలను పంచుకున్నారు. మూడు రోజులపాటు జరిగిన ఈసమావేశంలో జీ 20 సభ్యులతో పాటు ఆహ్వానిత దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు తమ ఉనికిని నమోదు చేసుకున్నారు. ఈ కార్యవర్గానికి ఇది నాల్గవ సమావేశం. గత మూడు ఈ.సి.ఎస్‌.డబ్ల్యు.జీ. సమావేశాల సంద ర్భం గా జరిగిన వివిధ సెషన్లలో, భారత ప్రెసిడెన్సీ గుర్తించిన మూడు విస్తృత నేపథ్య రంగాలపై సహ కార, సమగ్ర చర్చలుజరిగాయి. ఈఅంశాలపై మంత్రివర్గ సమావేశంలో ఏకాభిప్రాయంపై చర్చలు జరిగాయి. భూమి క్షీణతను అరికట్టడం, నీలి ఆర్థిక వ్యవస్థ, వనరుల సామర్థ్యం, వృత్తా కార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంపై ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు. దీనితో పాటు, మంత్రి వర్గ ప్రకటన ముసాయిదాను ఖరారు చేయడం సమావేశంలో ప్రతినిధులు ప్రధాన దృష్టి పెట్టారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు