Wednesday, October 16, 2024
spot_img

ట్యాంక‌ర్ ఫిల్లింగ్ స్టేష‌న్ల ఆక‌స్మిక త‌నిఖీ

తప్పక చదవండి
  • ట్యాంక‌ర్ డెలివ‌రీలో ఆల‌స్యం లేకుండా చూడాల‌ని ఆదేశం
  • డిమాండ్ ను బ‌ట్టి డెలివ‌రీ టైమింగ్స్ పెంచాల‌ని సూచ‌న‌
  • ట్యాంక‌ర్ ఫిల్లింగ్ స్టేష‌న్లను ప‌రిశీలించిన ఎండీ సుద‌ర్శ‌న్ రెడ్డి

జ‌ల‌మండ‌లి ప‌రిధిలో ఉన్న ప‌లు ట్యాంక‌ర్ ఫిల్లింగ్ స్టేష‌న్ల‌ను ఎండీ సుద‌ర్శ‌న్ రెడ్డి ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. జూబ్లీహిల్స్ వెంక‌ట గిరి, కొండాపూర్, మాదాపూర్ లో ప‌లు ఫిల్లింగ్ స్టేష‌న్ల ఎండీ శుక్ర‌వారం త‌నిఖీ చేశారు. ముందుగా వెంక‌ట గిరి ఫిల్లింగ్ స్టేష‌న్ కు వెళ్లిన ఎండీ ట్యాంక‌ర్ బుకింగ్, డెలివ‌రీ త‌దిత‌ర వివ‌రాలను అక్క‌డి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. బుకింగ్ టైమింగ్స్, ఏ స‌మ‌యానికి డెలివ‌రీ ప్రారంభిస్తున్నారు? అనే విష‌యాలు క‌నుక్కున్నారు. ట్యాంక‌ర్ డెలివరీకి సంబంధించిన ఇన్ అండ్ ఔట్ లాగ్ బుక్స్ ప‌రిశీలించారు. లాగ్ బుక్స్ స‌క్ర‌మంగా నిర్వ‌హించాల‌ని.. అందులో టైమింగ్స్ త‌ప్ప‌ని స‌రిగా న‌మోదు చేయాల‌న్నారు.

ట్యాంక‌ర్ డెలివ‌రీలో ఆల‌స్యం లేకుండా చూడాలన్నారు. బుక్ చేసిన వెంట‌నే.. ట్యాంక‌ర్ డెలివ‌రీ చేయడానికి ప్ర‌య‌త్నం చేయాలని పేర్కొన్నారు. పెండెన్సీని త‌గ్గించుకోవ‌డానికి.. స్థానిక అధికారులు వాళ్ల ప‌రిధిలో ప్లాన్ చేసుకోవాల‌ని వివ‌రించారు. బుకింగ్ ఎక్కువ వ‌స్తూ.. డెలివ‌రీలు పెండింగ్ లో ఉన్న కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో ప‌ని చేయ‌డానికి త‌గిన సిబ్బందిని స‌మ‌కూర్చుకోవాల‌ని సూచించారు. డిమాండ్ ను బ‌ట్టి.. డెలివ‌రీ టైమింగ్స్ ను కూడా పెంచుకోవాల‌ని వివరించారు. ట్యాంక‌ర్ల‌లో నింపుతున్న నీటి శాంపిల్ తీసుకుని ప‌రీక్షించారు. ఫ‌లితాల‌పై సంతృప్తి వ్య‌క్తం చేశారు. పంపు రూమ్ ల‌ను, క్లోరినేష‌న్ రూమ్ ల‌ను కూడా ప‌రిశీలించారు.

- Advertisement -

ట్యాంక‌ర్ డ్రైవ‌ర్ల‌తో ఎండీ ఇంట‌రాక్ష‌న్
ట్యాంక‌ర్ డ్రైవ‌ర్ల‌తో ఎండీ సుద‌ర్శ‌న్ మాట్లాడారు. ట్యాంక‌ర్ డెలివ‌రీల్లో ఏవైనా ఇబ్బందులున్నాయా? అని ఆరా తీశారు. ట్రాఫిక్ జామ్ స‌మ‌యాల్లో ట్యాంక‌ర్ డెలివ‌రీ ఆల‌స్యమవుతుంద‌ని ఎండీ గుర్తించారు. ట్యాంక‌ర్ ఇన్ ఛార్జుల‌తో మాట్లాడి ఈ పాస్ మిష‌న్, స్మార్ట్ కార్డుల‌ ప‌నితీరును అడిగి తెలుసుకున్నారు.

సీసీ కెమెరాల పనితీరు ప‌రిశీల‌న
ఫిల్లింగ్ స్టేషన్లలోని సీసీ కెమెరాలు స‌క్ర‌మంగా ప‌ని చేస్తున్నాయో లేదో పరిశీలించారు. ఇప్పటికే అన్ని స్టేషన్ల కెమెరాలు ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై ఉన్నాయని.. నిరంతరం వాటి ద్వారా అక్కడి పరిస్థి తిని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో రెవెన్యూ డైరెక్ట‌ర్ వీఎల్ ప్ర‌వీణ్ కుమార్, సీజీఎం విజ‌య‌రావు, సంబంధిత‌ జీఎం, డీజీఎం, మేనేజ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు