- ఆగస్టు 25 న ప్రారంభం..
- హైదరాబాద్, బెంగుళూరు మధ్య నడవనున్న రైలు..
- వివరాలు అందించిన దక్షిణ మధ్య రైల్వే వర్గాలు..
హైదరాబాద్: బెంగళూరులను కలిపే మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు ఎక్కేందుకు రెడీ అవుతోంది. 25 ఆగస్టు 2023న ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వర్గాలు తెలిపాయి. వేగంగా పనులు నడుస్తున్నాయని తెలిపాయి. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నడిచే ప్రస్తుత రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలా కాకుండా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ ఏడాది జనవరి 15 హైదరాబాద్‌కు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించారు. సికింద్రాబాద్ – విశాఖపట్నంలను కలుపుతుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సేవలందిస్తున్న మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. రైలు సామర్లకోట్ జంక్షన్, రాజమండ్రి, విజయవాడ జంక్షన్, ఖమ్మం, వరంగల్ వంటి కీలక స్టేషన్లలో ఆగనుంది. కాచిగూడ- యశ్వంత్‌పూర్ రూట్‌లో ప్రయాణించే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు కర్నూల్ మీదుగా ప్రయాణిస్తుంది. తొలుత రాయిచూర్ మార్గంలో వెళ్తుందని అంతా భావించినప్పటికీ.. కర్నూల్ మీదుగా నడపాలని నిర్ణయించారు. వచ్చే వారంలోనే ప్రారంభం కానున్న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు స్టాప్స్ కూడా నిర్ణయించారు. షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్, ఢోన్, ధర్మవరం రైల్వే స్టేషన్లలో నిలిపే విషయంలో నిర్ణయం కాలేదు.
హైదరాబాద్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలో ప్రారంభం కానుంది. ఇది హైదరాబాద్ – బెంగళూరులను కలుపుతుంది. ఈ హై-స్పీడ్ సర్వీస్ భారతదేశంలోని రెండు ప్రముఖ సాఫ్ట్‌వేర్ హబ్‌లు, హైదరాబాద్ – బెంగుళూరు మధ్య కీలకమైన లింక్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును హైదరాబాద్‌లో ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ రైలు సికింద్రాబాద్‌ను హైదరాబాద్- తిరుపతిలో కలుపుతుంది. కేవలం 8 గంటల 15 నిమిషాల్లో 662 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది సగటున గంటకు 80 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది.
బెంగళూరు-హైదరాబాద్ వందే భారత్ స్టాప్‌లు :
హైదరాబాద్‌కు రానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేడం, రాయచూర్ జంక్షన్, గుంతకల్ జంక్షన్‌లో షెడ్యూల్ ప్రకారం స్టాప్‌లు వేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్ – బెంగళూరు మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. ఈ రైలు హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ – బెంగళూరులోని యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ మధ్య నడుస్తుంది.