Friday, July 19, 2024

అక్రమ షడ్లను కూల్చేది ఎన్నడు..?

తప్పక చదవండి
  • మీనమేషాలు లెక్కిస్తున్న రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు..
  • బానామి పేర్లతో ఆక్రమ దందా..
  • ప్రభుత్వ భూమిలో షెడ్లు నిర్మాణం..
  • ఏ ప్రాతిపదికన ఇంటి నెంబర్లు జారీ చేస్తారు..
  • సొమ్ము ఒక్కరిది.. సోకు మరొకరిదా..
  • చుట్టూ బ్లూ షీట్లుతో పకడ్బందీగా ఏర్పాటు..
  • క్రయ విక్రయాలు జరపటం నేరం..
  • పీఓటి యాక్ట్ కింద స్వాధీనానికి రంగం సిద్ధం..

రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో 6 వార్డులో గల సర్వే నెంబర్ 205/1 లో 1.33 గుంటల ప్రభుత్య స్థలం ఉంది. ఈ భూమిలో సుమారు 45 మంది రిటైర్డ్ సైనికులకు కేటాయించినట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 1999 సం”లో ఇండ్ల స్థలాలు కేటాయిస్తే ఎక్కువ మంది విక్రయాలు జరిపారు.. ప్రభుత్వం ఎవరికీ కేటాయించిన స్థలాల్లో వారే నిర్మాణాలు జరుపుకోవాలి.. కానీ ఇక్కడ అంతా బినామీలే రాజ్యమేలుతున్నారు.. వీకర్ సెక్షన్, రిటైర్ట్ సైనికులు ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థలాలలో కొలతల ప్రకారం పూరిల్లు, పెంకుటిల్లు లేక మిద్దెలు నియమ నిబందనలతో ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. 1999 సంవత్సరంలో నిర్మాణాలు మొదలు పిడితే 2000 చివరి నాటికి పూర్తి చేయాలి. కాని ఇక్కడ అలా జరగటం లేదు.. అనాడు కేటాయించిన స్థలాలను కారు చౌకగా కొనుగోలు చేసి కోట్లు కొట్టేసేందుకు అధికార పార్టీ నాయకులే కొందరు కుయుక్తులు పన్నారు. బినామి పేర్లతో డోర్ నెంబర్లు పొంది అక్రమ దందాకు తెగబడ్డారు.. ఇంటి నెంబర్, టిన్ నెంబర్ల ప్రకారం బి. రామ క్రిష్ణారెడ్డి, మహ్మద్ ఖాజా మీర్, యం. అనసూయ, సర్పరాజ్ బేగం, రమ్మిశెట్టి సుబ్బారావు, ఈస్టర్ కనిత, లాకర్ అంజయ్యి, ఏ. శ్రీనివాసరావు, ఈ. ఇమ్మానేలు, సాగయ్య మేరీ, ఎం నర్సమ్మల్, అసద్ ఉల్లాఖాన్, గోన ఇబి నజర్, ఇంటి నెంబర్లు వరుసుగా 7-54 -12 మొదలుకొని 24, 25, 26, 38, 41, 53, 86, 92, 93, 94, 98, 118 ఈ నెంబర్లు డిసెంబర్ 2022లో జారీ చేసినట్లు, మున్సిపల్ రికార్డులు తెలుపుతున్నాయి.. రిటైర్డ్ సైనికులు కేవలం ఇద్దరు నుండి నలుగురు వరకు స్థలాలు కేటాయించిన వారు ఉండవచ్చునని స్థానికులు పేర్కొంటున్నారు..

చుట్టూ పకడ్బందీగా బ్లూ షీట్ల నిర్మాణం :
రిటైర్ట్ సైనికులకు కేటాయించిన భూమిలో బ్లూ షీట్ల నిర్మాణం ఎందుకు జరిగింది..? అక్కడ సిమెంట్ గోదాములు ఎందుకు వెలిసాయి .? 100 గజాలు కేటాయిస్తే వరుసగా రాత్రికి రాత్రే షెడ్లు వెలిశాయా..? లేదా ఎవరి జాగాలో వారే చుట్టూ బ్లూ షీట్లు ఏర్పాటు చేసుకోవాలి కదా? సొమ్ము ఒక్కరిది సోకు మరొకరిది అన్న చందంగా గుట్టు చప్పుడు కాకుండా రిటైర్ట్ సైనికులు సైతం చాలామంది వారికి కేటాయించిన స్థలాలను బహిరంగ మార్కెట్ లో విక్రయించారు.. ప్రభుత్వం కేటాయించిన ఇండ్ల స్థలాలను ఎవరైనా క్రయ, విక్రయాలు జరిపితే అది చెల్లదు. ప్రోహాబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కింద తిరిగి స్వాధీనం చేసుకొనే హక్కు ప్రభుత్వానికి ఉంది.. బినామి పేర్లతో ఇంటి నెంబర్లు పొందిన వారిని గుర్తించి.. వారి వెనుక కథ నడిపే ఖతర్నాక్ ను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు