Wednesday, October 9, 2024
spot_img

అర్చకుల భృతి రూ. 10 వేలకు పెంపు..

తప్పక చదవండి
  • వెల్లడించిన సీఎం కేసీఆర్..
  • గోపనపల్లిలో బ్రాహ్మణ సదన్ ప్రారంభం..
  • వేదపండితులకు భృతి రూ. 2,500 నుంచి
    రూ. 5 వేలకు పెంపు..
  • అర్హత వయసు 75 నుంచి 65 ఏళ్లకు తగ్గింపు..
  • బ్రాహ్మణులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత : సీఎం కేసీఆర్..

ఆలయాలకు దూపదీప నైవేద్యం కింద అర్చకులకు భృతి రూ.10 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపనపల్లిలో బ్రహ్మణ సదన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన కేసీఆర్.. బ్రహ్మణ పరిషత్ ద్వారా వేద పండితులకు ఇస్తున్న భృతిని రూ. 2500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. భృతిని పొందే అర్హత వయస్సు 75 ఏళ్ల వయసు పరిమితి నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నామన్నారు. ఆలయాలకు ఇకపై అన్యువల్ గ్రాంట్ రూపంలో నిధులిస్తామని తెలిపారు. ఐఐటీ,ఐఏఎంలో చదివే బ్రాహ్మణ స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తింపజేస్తామన్నారు.

బ్రాహ్మణులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం కేసీఆర్ అన్నారు. బ్రాహ్మణ సదనం నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. సూర్యపేటలోనూ త్వరలోనే సదనం భవనం ప్రారంభిస్తామని చెప్పారు. దూపదీప నైవేద్య పథకం 6441 ఆలయాలకు పెంచుతున్నామని చెప్పారు. బ్రహ్మణ పరిషత్ కు ఏడాదికి 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. 2017లో శేర్లింగంపల్లిలో బ్రహ్మణ సదనం భవనానికి శంకుస్థాపన చేశారు. 6 ఎకరాల 10 గుంటల స్థలం కేటాయించారు. 12 కోట్లు ఖర్చు చేసి భవనం నిర్మించారు.

- Advertisement -

మ‌రో 2,796 దేవాల‌యాల‌కు ధూప‌దీప నైవేద్యం :
ప్ర‌స్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాల‌యాల‌కు ధూప‌దీప నైవేద్య ప‌థ‌కం వ‌ర్తిస్తున్న‌ది అని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మ‌రో 2,796 దేవాల‌యాల‌కు కూడా ధూప‌దీప నైవేద్యం ప‌థ‌కం విస్త‌రింప‌జేస్తాం. దీంతో రాష్ట్రంలో 6,441 దేవాయాలకు ధూప‌దీప నైవేద్యం కింద నిర్వ‌హ‌ణ వ్య‌యం అందుతుంది. ఈ సంద‌ర్భంగా మ‌రో శుభ‌వార్త కూడా మీతో పంచుకుంటున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు ధూప‌దీప నైవేద్యం ప‌థ‌కం కింద దేవాల‌యాల నిర్వ‌హ‌ణ కోసం అర్చ‌కుల‌కు నెల‌కు రూ. 6 వేల చొప్పున ప్ర‌భుత్వం అందిస్తున్న‌ది. ఈ మొత్తాన్ని రూ. 10 వేల‌కు పెంచుతున్నామ‌ని తెలియ‌జేస్తున్నాను. ఈ నిర్ణ‌యం మీ అంద‌రిని ఎంతో సంతోష‌పెడుతుంద‌ని భావిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

బ్రాహ్మ‌ణ విద్యార్థుల‌కు ఫీజు రియింబ‌ర్స్‌మెంట్‌ :
వేద పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ కోసం ఇస్తున్న రూ. 2 ల‌క్ష‌లను ఇక నుంచి యాన్యువ‌ల్ గ్రాంట్‌గా ఇస్తామ‌ని తెలియ‌జేస్తున్నాను అని కేసీఆర్ తెలిపారు. ఐటీఎం, ఐఐఎం లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌ల్లో చ‌దివే బ్రాహ్మ‌ణ విద్యార్థుల‌కు ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని వ‌ర్తింజేసే నిర్ణ‌యం తీసుకున్నాం. అదే విధంగా అనువంశిక అర్చ‌కుల స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌లో కేబినెట్‌లో చ‌ర్చించి ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇస్తున్నాను. స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ నిల‌యంగా, వేద పురాణాల ఇతిహాసంగా, విజ్ఞాన స‌ర్వ‌సంగా, వైదిక క్ర‌తువుల క‌ర‌దీపిక‌గా, పేద బ్రాహ్మ‌ణుల ఆత్మ‌బంధువుగా, లోక క‌ల్యాణ‌కారిగా తెలంగాణ బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో ఈ విప్ర‌హిత వెలుగొందాల‌ని ఆ దేవ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు