Saturday, May 11, 2024

దమ్ముంటే గజ్వేల్‌లో పోటీ చెయ్..

తప్పక చదవండి
  • కేసీఆర్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి..
  • సీఎం కేసీఆర్ మీ పాలనపై నమ్మకం ఉంది కదా
  • గద్వాల నియోజకవర్గం నుంచి 42 మంది కాంగ్రెస్‌లోకి..
  • గద్వాలలో అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తాం : రేవంత్ ధీమా
    హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు కాక మీద ఉన్నాయి.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. అప్పుడే ఎన్నికల మూడ్ వచ్చేసింది.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే, రాబోయేది మా ప్రభుత్వమే అని ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. మీ పాలనపై మీకు నమ్మకం ఉంటే గజ్వేల్ లో పోటీ చేయాలని కేసీఆర్ ను చాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి.
    ”గద్వాల జిల్లా బంగ్లాలో బందీ అయ్యింది. గద్వాల ప్రజలను బంగ్లా ముందు బానిసలుగా మార్చారు. గద్వాల జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. కొందరు నేతలు బీఆర్ఎస్ లోకి, మరొకరు బీజేపీలోకి పోయినంత మాత్రాన కాంగ్రెస్ బలహీనపడదు. బలహీన వర్గాలు ఎప్పుడూ కాంగ్రెస్ వైపే. ఈసారి గద్వాల జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. కేసీఆర్ బలమైన నాయకులను ఒక్కొక్కరిగా అడ్డు తొలగించుకున్నారు. పాలమూరు బిడ్డకు సోనియా గాంధీ పీసీసీ ఇచ్చి గౌరవించారు. పాలమూరు వెనకబడ్డ జిల్లా కాదు. వెనుకబడిన వారిని నడిపించే జిల్లా అని చాటాలి. గద్వాలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. పాలమూరు జిల్లాలో 14కు 14 స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించుకుందాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసుకుందాం. సీఎం కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా. కేసీఆర్ కు తన పాలనపై నమ్మకం ఉంటే కేసీఆర్ గజ్వేల్ లో పోటీ చేయాలి. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలి. కాంగ్రెస్ శ్రేణులారా.. వంద రోజులు కష్టపడండి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు” అని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే.. ప్రధానంగా బీఆర్ఎస్‌ పార్టీకి గులాబీ నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. పార్టీ నాయకత్వం మీద వ్యతిరేఖతో.. పట్టించుకోవట్లేదన్న అసంతృప్తో.. వేరే పార్టీల నుంచి వస్తున్న ఆఫర్లో.. మొత్తానికి జంపింగ్ జపాంగులు మాత్రం గట్టిగానే జరుగుతున్నాయి. అయితే.. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలు మారగా… వారిలో ఎక్కువ మంది మాత్రం రాష్ట్రంలో మాంచి ఫామ్‌లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే.. బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఒక్కసారిగా 42 మంది సిట్టింగులు పార్టీ మారిపోయి… హస్తం గూటికి చేరారు. అయితే.. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కీలక నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్‌లోకి రావటంతో.. పాలమూరు నుంచి కూడా గట్టిగానే చేరికలు మొదలయ్యాడు. ఈ క్రమంలోనే.. గద్వాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సరిత.. ఇటీవలే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. వచ్చే ఎన్నికల్లో గద్వాల టికెట్ ఇస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చిందో ఏమో.. తన బలగాన్ని మొత్తం.. కాంగ్రెస్‌లోకి పట్టుకొచ్చేశారు సరిత. ఒకేసారి.. 42 మంది సిట్టింగులను తీసుకొచ్చేశారు. అందులో 30 మంది సర్పంచులు, 12 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీళ్లంతా.. హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సిట్టింగ్‌లతో పాటు గద్వాల నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నేతలందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి అందరినీ పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీలో అందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. గద్వాల జిల్లా కాంగ్రెస్‌ కంచుకోట అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పాలమూరులో అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరనుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయ్యిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గద్వాల ప్రజలను బంగ్లా ముందు బానిసలుగా మార్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే.. మరోసారి సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చి.. తానూ గజ్వేల్‌ నుంచి పోటీచేయాలని రేవంత్ మరోసారి సవాల్ విసరడం ఇప్పుడు సంచలంగా మారింది..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు