Sunday, April 28, 2024

వెల్ విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మహా మోసం..

తప్పక చదవండి
  • బరితెగించి మద్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటం..
  • అమాయకులే టార్గెట్.. మాయ మాటలే పెట్టుబడి ..
  • ప్రజల జీవితంతో చెడుగుడు ఆడుతున్న వైనం.. !!
  • వెల్ విజన్ అధినేత శ్రీనివాసరావు కందుల చీకటి వ్యాపారం…
    ( కూకట్ పల్లి కేంద్రంగా గోకుల్ ప్లాట్స్.. 9 వ పేజ్, వెంకటరమణ కాలనీలో మూడు సంవత్సరాల క్రితం వెల్ విజన్ పేరుతో టీవీ, ఫ్రిజ్ గృహోపకరణల చిన్న దుకాణం వెలసింది.. కాగా ఎంత వ్యాపారం చేసినా.. రేయింబళ్లు కష్టపడ్డా సరైన విధంగా అధిక లాభాలు రాకపోవడంతో.. తన మోసపూరిత మెదడుకు పాడాను పెట్టి అమాయకపు ప్రజలను బురిడీ కొట్టించడమే ధ్యేయంగా ముందుకు సాగాలనై నిశ్చయించుకున్న సదరు కందుల శ్రీనివాసరావు.. నిరాటంకంగా తన చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు..
    హైదరాబాద్ ధనార్జనే ధ్యేయంగా.. మోసమే పెట్టుబడిగా.. సామాన్య ప్రజలను టార్గెట్ చేసి.. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతారని ఆశలు కల్పిస్తూ.. ఆన్లైన్ ట్రేడింగ్, గొర్రెల ఫార్మింగ్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో అధిక లాభాలు ఉంటాయంటూ నిరుద్యోగ యువతను, మహిళలను మభ్యపెడుతూ.. జిల్లాకో గోడౌన్ ఓపెన్ చేస్తాం.. గోడౌన్ ని మీ పేరున చేస్తాం.. దాని విలువ కోటి రూపాయలు అంటూ.. లక్షల్లో పెట్టుబడి పెట్టండి రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న శ్రీనివాసరావు కథనం మహాద్భుతం. కాగా ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే ఉన్నపలంగా డబల్ లాభం, గొర్ల, మేకల ఫార్మింగ్ నష్టం లేని వ్యాపారం.. అని కల్లబొల్లి కబుర్లు చెబుతూ.. ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుత అవకాశాలంటూ అవగాహన లేని అమాయకులను ఆకర్షితులను చేస్తూ.. తక్కువ ధరలో ప్లాట్లు.. అంటూ అమ్మకం చేయడం ఆనక ముఖం చాటేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. మోసమే పరమావధిగా విశ్వాసాలను ఎరగా చూపుతూ.. ప్రభు నీకు ప్రత్యేకమైన అవకాశం ఇచ్చాడు.. ఆ అవకాశాన్ని కాపాడుకొని మంచి జీవితాన్ని అనుభవించండి.. అంటూ ప్రభువు ఫోటోతో వ్యాపారం చేయడం సర్వ మానవాళిని ఆశ్చర్య చకితులను చేస్తోంది..

ఈజీ మనీ కోసం వెంపర్లాడే అమాయకులను వేటాడే ఈ గూడు పుఠాణీ గాళ్లు.. గడ్డిని సైతం బంగారం రంగు పూసి, హిమాలయాల్లో లేదా జెరు సలెంలో దేవుని అనుగ్రహంతో పుట్టిన గడ్డి అని.. అన్ని రోగాలకు మందు అని మోసం చేసి బ్రతికే మాయగాళ్లు.. ఈ వెల్ విజన్ గ్రూప్ అధిపతి కందుల శ్రీనివాస్ రావ్ మాటలు కోటలు దాటుతాయి.. కానీ నిజానికి వాస్తవ రూపంలో గడపలు దాటవనే చేదు నిజాన్ని ప్రజలు తెలుసుకోనంత కాలం.. ఇలాంటి భస్మాసురులు పుట్టుకొస్తూనే ఉంటారు. ఆశల వలయంలో కొట్టుమిట్టాడుతున్న మధ్య తరగతి జీవితాల పెట్టుబడులే తమ జీవితాలకు సోపానాలుగా తీర్చిదిద్దుకుంటున్న వైనం జగమెరిగిన సత్యం. ఈ మాయల మరాఠాలు ప్రభావవంతంగా మంచి మాటలు చెప్పి, అమాయకపు ప్రజలను బుట్టలో వేసుకుని బోర్లా కమ్మేసి ఉన్న కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తుండటం అత్యంత శోచనీయం.. ఈ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ విధానంలో నెట్వర్కింగ్ పేరు చెప్పి బాగుపడటం చరిత్రలో లేదు. నెట్వర్కింగ్ మార్కెటింగ్ అంటేనే మోసం.. బాధితులు తమ పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకొని.. సంబంధిత పోలీస్ విభాగానికి ఫిర్యాదు అందజేయాలని సామాజిక కార్యకర్తలు కోరుచున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు