మల్కాజ్గిరి : చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది, కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే.గురువారం బాచుపల్లి లో రోడ్డుపై ఏర్పడ్డ గుంత వల్ల 8 సంవత్సరాల బాలిక దీక్షిత ప్రాణాలు కోల్పోవడం జరిగింది.అలాంటి సంఘ టనలు పునరావృతం కాకుండా అధికా రులు ముందు చర్యలుగా రోడ్లపై ఏర్పడ్డ గుంతలు అన్నిటిని పూడ్చగలిగితే, మరో ఏ ప్రాణం పోకుండా చర్యలు తీసుకున్న వారవుతారు. మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ 141 డివిజన్ పరిధిలోని సఫల్ గుడా హనుమాన్ పేట్, రోడ్డుపైన దయానంద నగర్ లో ఒక్క ఫీట్ కు లోతుగా గుంతలు ప్రమాదకరంగా ఏర్పడ్డాయి.ఏదైనా వాహనం అదుపు తప్పితే ప్రాణాలు కోల్పో వడం తథ్యం.మరో సంఘటన జరగకముందే తక్షణమే అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని వాహనదారుల కోరుతున్నారు.