Friday, September 20, 2024
spot_img

సిటీ బస్సులు కొత్త మార్గాలు..

తప్పక చదవండి

నగర ప్రయాణికులకు మరో శుభవార్త. మరో రెండు కొత్త మార్గాలలో సిటీ బస్సు సర్వీసులను ప్రయాణికుల కోసం ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. అందులో భాగంగా నగరంలో మరో రెండు కొత్త మార్గాలను ఆర్టీసీ గుర్తించిం ది. ఇందులో ఎల్‌బీనగర్‌ నుంచి కాచిగూడకు వయా తార్నాక, విద్యానగర్‌, శంకర్‌మఠ్‌ మీదు గా చేరుకుంటుంది. రెండోది మదీనా / బడంగ్‌పేట్‌ నుంచి ఈసీఐఎల్‌ వరకు వయా నాగోల్‌ ఎక్స్‌ రోడ్‌, ఉప్పల్‌ ఎక్స్‌ రోడ్‌, తార్నాక, లాలాపేట్‌ మీదుగా ఈసీఐఎల్‌కు బస్సులు నడిపించనున్నారు. అయితే, ఎల్‌బీనగర్‌ నుంచి కాచిగూ డ వరకు ఆర్డినరి, బడంగ్‌పేట్‌ నుంచి ఈసీఐఎల్‌ వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను నడిపించనున్నట్లు ఆర్‌టీసీ గ్రేటర్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే, ఈ రెండు బస్సులు కూడా మదీనా డిపోకు చెందినవన్నా రు. అయితే, ఎల్‌బీ నగర్‌ నుంచి కాచిగూడకు (90ఎల్‌/కే) పేరుతో తిరుగనున్న ఈ బస్సు ప్ర తి 30 నిమిషాలకు ఒకటి అందుబాటులో ఉం టుంది. రోజూ కాచిగూడలో మొదటి సర్వీసు ఉదయం 8.15 గంటలకు, చివరి సర్వీసు రాత్రి 7.40లకు,. కాచిగూడలో మొదటి సర్వీసు ఉ॥ 7.20లకు, చివరి సర్వీసు రాత్రి 8.40లకు, మదీనా నుంచి ఈసీఐఎల్‌ (90బీ/ఈ) పేరుతో నడిచే బస్సు ఉ॥ బడంగ్‌పేట్‌లో 6.10లకు ప్రారంభమవుతుంది. చివరి సర్వీసు సా॥ 7.30 లకు ఉంటుందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు