Wednesday, February 28, 2024

కేసీఆర్ ను మళ్లీ సీఎం చేస్తే.. ఒవైసీ మీకు చుట్టమైనట్లే..

తప్పక చదవండి
 • హిందువులను నరికిచంపుతానన్న ఒవైసీ వ్యాఖ్యలను శిరసావహిస్తారా?
 • హిందుగాళ్లు బొందుగాళ్లన్న కేసీఆర్ కు బుద్దిచెప్పిన కరీంనగర్ ప్రజలు గ్రేట్
 • రాజకీయాలంటే విరక్తి పుడుతోంది
 • మోదీని చూసి రాజకీయాల్లో కొనసాగుతున్నా
 • ఆత్మగౌరవ భవనాల పేరుతో కులాల మధ్య చిచ్చుపెడుతున్న కేసీఆర్
 • ఆత్మ గౌరవ భవనాలతో పేదల కడుపు నిండేనా?
 • ఏ కులం వాళ్లయినా సరే… ఆ కుల పేదల పక్షాన నిలిస్తేనే మనుగడ
 • ఒక్కో కుల సంఘ నాయకుడు.. కనీసం 10 మంది పేదలను ఆదుకోవాలి
 • అప్పుడే తెలంగాణలో పేదరికాన్ని నిర్మూలించవచ్చు
 • బీజేపీ అంటేనే మున్నురు కాపుల పార్టీ..
 • ఆంధ్రాలో మొదలైన కాపు లొల్లి.. తెలంగాణలోనూ మున్నూరుకాపు ఉద్యమం స్టార్ట్…
 • మున్నూరుకాపు ఆత్మీయ అభినందన సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,
  ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు..

‘‘మళ్లీ కేసీఆర్ సీఎం అవుతాడని అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పే మాటలను మీరు నమ్ముతారా? ఆయన మాటలను శిరసావహించి కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తే హిందువులను నరికి చంపుతానన్న అక్బరుద్దీన్ మీకు చుట్టమైనట్లే..’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. హిందుగాళ్లు, బొందుగాళ్లన్న కేసీఆర్, 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానన్న ఒవైసీ మాట్లాడుతుంటే మున్నూరు కాపులుసహా హిందువులెరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హిందూగాళ్లు బొందుగాళ్లంటే కేసీఆర్ కు కర్రు కాల్చి వాతపెట్టిన కరీంనగర్ ప్రజలు గ్రేట్ అని అన్నారు. ఆంధ్రాలో కాపుల లొల్లి మొదలైందని, తెలంగాణలోనూ మున్నూరుకాపు ఉద్యమం స్టార్ట్ అయ్యిందన్నారు. ఆదివారం రోజు సికింద్రబాద్ లోని సిఖ్ విలేజ్ లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ఆత్మీయ అభినందన సభ’’కు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…

‘‘ఆత్మీయ అభినందన సభ’’ పేరుతో మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఎంపీగా గెలిచిన సమయంలో ఇదే హాలులో సన్మానించారు. నేను పాదయాత్ర చేసిన ప్రతి చోటుకు వచ్చి నాతోపాటు అడుగులో అడుగు వేశారు. అందరికీ ధన్యవాదాలు.. కులం అంటే అభిమానం ఉండాలే తప్ప కుల గుల ఉండకూడదు. కొంతమంది తమ స్వార్ధం కోసం కులం పేరు చెప్పుకుని పదవులు సంపాదిస్తుంటారు. అది కరెక్ట్ కాదు. నేనెప్పుడూ కులం పేరు చెప్పుకుని లాబీయింగ్ చేయలే. హిందూ ధర్మం కోసం, దేశం కోసం నిరంతరం పనిచేసే బీజేపీ కార్యకర్తను నేను. కొందరు కుల సంఘాల నేతలు ఆస్తులను, పదవులను కాపాడుకోవడానికే అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. పేదలను పట్టించుకోవడం లేదు. కుల సంఘాల పేరుతో కట్టిస్తున్న ఆత్మగౌరవ భవనాలతో ఏం ఒరిగింది? కులంలో ఉన్న పేదలకు న్యాయం జరుగుతుందా? అసలు మున్నూరు కాపు అంటే ఎవరు? మీరేమనుకున్నారు?… నా ద్రుష్టిలోనైతే… ప్రశ్నించే వాడే నిజమైన మున్నురు కాపు. పేదల తరపున నిలబడి కలబడి కొట్లాడేటోడే మున్నూరుకాపు. ఏ కులం వాళ్లయినా సరే… ఆ కులంలో పేదలను ఏ విధంగా ఆదుకోవాలనే దానిపై ద్రుష్టి పెట్టాలి. మున్నూరు కాపు కులంలో చాలా మంది పేదలున్నరు. ఇల్లులేక, పూట గడవక పస్తులుంటున్న వాళ్లు చాలా మంది ఉన్నరు. వాళ్లు చేయిచాచి అడగలేరు.. ప్రభుత్వం వాళ్లను పట్టించుకోదు… అట్లాంటోళ్లకు అండగా ఉండాలి.

- Advertisement -

ఏ కులంలోనైనా పేదలుంటారు. తినడానికి తిండిలేక అల్లాడుతున్న వాళ్లున్నరు. వాళ్ల పక్షాన ఆ కుల సంఘాలు నిలబడాలి. రాజకీయ నాయకులు నమ్మించి మోసం చేస్తున్నారు. నాకే రాజకీయాలంటే విరక్తి కలుగుతోంది. కానీ మోదీ గారిని చూసి పనిచేస్తున్నా. ఎందుకంటే ఆయన 24 గంటలపాటు పేదల కోసం కసితో పనిచేస్తున్నారు. నాకు ఏ పదవి ఇచ్చినా దానికి పూర్తి న్యాయం చేయాలని చూస్తా… అంతే తప్ప వెనక్కుపోయే ప్రసక్తే లేదు.. మున్నూరుకాపు సంఘం చేసే మంచి పనులను చూసి ఇతర కుల సంఘాలు స్పూర్తి పొందాలే పనిచేయాలే తప్ప మా కులం గొప్ప అంటూ గొప్పలు చెప్పుకుంటే ఉపయోగం ఉండదు. సీఎం కేసీఆర్ మోసగాడు.. ఏ కులం వాళ్లైనా పైకి వస్తున్నారంటే.. ఆ కుల సంఘాలను చీల్చి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నడు. గతంలో ఒక కులానికి ఒకే సంఘం ఉండేది. ఆ సంఘం నాయకుడు పిలుపునిస్తే… ఆ కులం వాళ్లంతా వచ్చి పోరాడేవాళ్లు… కేసీఆర్ వచ్చాక కులాలను చీల్చి కులాల మధ్య కుంపట్లు పెడుతున్నడు. కేసీఆర్.. కుల సంఘాల సమస్యలనూ ఏనాడూ పరిష్కరించడు. ఎప్పుడైనా ప్రగతి భవన్ కు పిలిచి మటన్, తలకాయ, బోటీ వంటి వంటకాలతో తిండి పెట్టి సమస్యలను పరిష్కరించకుండా పంపించడం అలవాటుగా మారింది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మున్నూరు కాపులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే పార్టీ బీజేపీ. సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమిచ్చింది. ఎంపీని చేసింది. రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించింది. డాక్టర్ లక్ష్మణ్ కు రాజ్యసభ సభ్యుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించింది. బీజేపీలో కష్టపడి పనిచేసే మున్నూరు కాపులకు అనేక పదవులొస్తాయనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? ఇప్పుడు మున్నూరు కాపు పార్టీ అంటే బీజేపీయేననే విషయం ప్రజల్లోకి వెళ్లింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ మన బలహీనవర్గానికి చెందిన నాయకుడు. సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం పని చేసే నాయకుడు. పేదలకు ప్రభుత్వ ఫలాలు అందాలని నిరంతరం పరితపిస్తున్న నేత.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేబినెట్ లో 27 మంది బీసీలకు, 12 మంది ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశం కల్పించిన ఘనత నరేంద్రమోదీకే దక్కుతుంది. అగ్రవర్ణ కులాల్లోని పేదలకు రిజర్వేషన్ కల్పించిన మహానేత. దయచేసి కులాల పేరుతో రెచ్చగొట్టే వాళ్లను గమనించండి. ఆత్మగౌరవ భవనాల్లో బందీ కావొద్దు… మళ్లీ కేసీఆర్ సీఎం అవుతాడని అక్బరుద్దీన్ ఒవైసీ చెబుతున్నడు.. బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే… అక్బరుద్దీన్ ఒవైసీ మాటను మీరు శిరసావహిస్తే… కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే… మీకు అక్బరుద్దీన్ చుట్టమైతడు… ఇజ్జత్ పోతుంది.. హిందూ ధర్మం ప్రమాదంలో పడింది. హిందుగాళ్లు, బొందుగాళ్లన్న కేసీఆర్, 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానంటే మున్నూరు కాపులు ఎందుకు స్పందించలేదు? కరీంనగర్ కు కేసీఆర్ వచ్చి హిందూగాళ్లు బొందుగాళ్లు అంటే ఏం చేసినం… కేసీఆర్ కు బుద్ది చెప్పినమా? లేదా?.. మరి మున్నురూ కాపులు, హిందువులంతా మనదేవతలను కించపరుస్తున్న ఒవైసీకి ఎందుకు బుద్ది చెప్పరు? కేసీఆర్ కొడుకు ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నడా? అమెరికాలో ఉన్నడు.. ఉద్యమం తీవ్ర స్థాయికి వచ్చాక జెండా పట్టి అధికారాన్ని అనుభవిస్తున్నడు.. మీ అయ్య తరువాత ఆయన సీఎం కావాలట.. సీఎం పదవి నీ అయ్య జాగీరా? తెలంగాణలో మళ్లీ సీఎం అయితే పేదోడే కావాలి. పేదల గురించి ఆలోచించే పార్టీ అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతయి. కేసీఆర్ మళ్లీ వస్తే బిచ్చపు బతుకులే… కుల సంఘాల నాయకులెవరూ ఆ దిశగా ఆలోచించకపోవడం బాధాకరం. కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ దోచుకుంటున్నా పట్టించుకోవడం లేదు… నా పాదయాత్రలో పేదల పడుతున్న కష్టాలను కళ్లారా చూసిన.. కాళ్లకు చెప్పులేసుకునే స్తోమత లేక, కాళ్లు విరిగినా, రోగమొచ్చినా చికిత్స చేసుకునేందుకు పైసల్లేక అల్లాడుతున్న వాళ్లను చూసిన. ఒక్క పూట తిండి తింటూ బతుకు నెట్టుకొస్తున్న వాళ్లను చూసి చలించిపోయిన. మున్నూరు కాపుసహా అన్నీ కులాలకు నా విజ్ఝప్తి ఒక్కటే.. మీ మీ ప్రాంతాల్లో ఒక్కో కులానికి సంబంధించి కనీసం 10 మంది పేదలను ఆదుకోండి. వాళ్లకు ఉపాధి కల్పించి పిల్లలను చదివించండి.. అప్పుడే అన్నీ కులాల పేదరికం నుండి బయటకొచ్చి బాగుపడతాయి. ఒక్కసారి పైసలు తీసుకుని ఓట్లేస్తే ఐదేళ్లు నరకం చూస్తున్నరు. పైసలేసుకుని ఓట్లేసే రోజులు పోయినయ్. కుల సంఘాల నేతలు స్వార్ధాన్ని పక్కనపెట్టి నిస్వార్ధంగా పనిచేసి పేదరికంపై పోరాడండి. మీ అందరికీ అండగా ఉంటా… ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నా.. ఆంధ్రాలో కాపుల ఉద్యమం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మున్నూరుకాపుల లొల్లి మొదలైంది.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటాలు చేయండి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు