- నోటీసులు జారీ చేసిన నార్కోటిక్ అధికారులు..
- రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు..
- ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- నాతోబాటు నవదీప్ డ్రగ్స్ తీసుకున్నాడన్న నిందితుడు రాం చందర్..
హైదరాబాద్ : టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న హీరో నవదీప్ విచారణకు హాజరుకావాలని నార్కోటిక్ బ్యూరో నోటీసులు జారీ చేసింది. 41 A కింద నోటీసులు జారీ చేసిన నార్కోటిక్ అధికారులు శనివారం (సెప్టెంబర్ 23)న విచారణకు రావాలంటూ ఆదేశించారు. కాగా ఇటీవల మాదాపూర్ పోలీసులు నిర్వహించిన రైడ్‌లో మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హీరో నవదీప్‌ను డ్రగ్ కన్జ్యూమర్‌గా గుర్తించారు.. పోలీసుల ఆపరేషన్‌లో పట్టుబడిన రాంచందర్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంతో నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు రాంచందర్ తెలిపారు. దీంతో నార్కోటిక్ అధికారులు నవదీప్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు..