Wednesday, September 11, 2024
spot_img

మంత్రి పదవికి రాజీనామా చేసి.. రాజకీయ సన్యాసం తీసుకుంటా..

తప్పక చదవండి
  • కార్మిక ఉపాధి కల్పనాశాఖ మంత్రి మల్లారెడ్డి
    శామీర్‌పేట: తెలంగాణలో రాష్ట్ర సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెడుతున్న పథకాల మాదిరిగా దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే నా మంత్రి పదవికి రాజీనమా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కార్మిక ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం శామీర్‌పేట మండలం లాల్‌గడి మలక్‌పేట రైతువేధికలో ఏర్పాటు చేసిన తీర్మాణం సమావేవానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ రైతు బందు, ఇరవైనాలుగు గంటల ఉచిత కంరెంటు ఇస్తున్నారన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతు కోసం అనేక బృహత్తర పథకాలను ప్రవేశపెట్టారన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి పక్షాలు చీటికి మాటికి సీఎం కేసీఆర్‌, మంత్రి కెటీఆర్‌లను దూషించడం తగదని, తాను గ్రామ గ్రామాన తిరుగుతున్నానని ఎన్నికలు ఎప్పడొచ్చినా బీఆర్‌ఎస్‌ అధికారం చేపడటం తధ్యమన్నారు. రేవంత్‌రెడ్డి ఎంపీగా నియోజకవర్గంలో చేసిన శంకుస్థాపనలు, అభివృద్ది చూపించాలని సవాల్‌ విసిరాడు. ఎన్నికలు వస్తున్న వేల రేవంత్‌రెడ్డి గడికీ ఆమెరికాకు వెల్లడం వెనుకాల మతలబు ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 56 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో దేశంలోని రైతులు దగా, మోసానికి గురయ్యారని దుయ్యబట్టారు. దేశ ప్రజలను కాంగ్రెస్‌ ఏవిధంగా వంచనకు గురిచేసిందో గ్రహించారని, ఆ పార్టీ దేశంలో అధికారంలో లేకపోవడమే ఇందుకు నిధర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబందు జిల్లా అధ్యక్షుడు నందరెడ్డి, డీసీఎంస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌ రెడ్డి, మండల రైతు బందు అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయ్‌, జడ్పీటీసీ అనిత, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు