- పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటన
- రాష్ట్రవ్యాప్తంగా 2,846 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
హైదరాబాద్, వచ్చేనెల 1న జరిగే గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు టీఎస్?పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పరీక్షలను నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి జులై 1న టీఎస్?పీఎస్సీ రాతపరీక్ష నిర్వహించనున్నది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు మొత్తం 9,51,321 మంది అప్లై చేశారు. నిర్వహణకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 2,846 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్?లోనే ఎక్కువగా సెంటర్లున్నాయి. పరీక్షల పర్యవేక్షణకు 40వేల మంది ఇన్విజిలేటర్లను నియమించగా, ఇంకో 10 వేల మంది ఇతర సిబ్బందిని ఏర్పాటు చేశారు. పరీక్షల్లో అభ్యర్థుల ఐడెంటీఫై కోసం కొత్త విధానం తెస్తు న్నట్టు అధికారులు చెప్తున్నారు. ముందుగా గ్రూప్-4 ద్వారా 9,168 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించి, నోటిఫికేషన్?లో 8,039 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. చివరికి బీసీ గురుకులాల్లో 141 పోస్టులు యాడ్ చేయడంతో మొత్తం పోస్టుల సంఖ్య 8,180కి చేరింది. మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) లేదా ఓంఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్)-150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.
1) పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తారు. అందుకే అభ్యర్థులు ముందే చేరుకోండి.
2) ఉదయం పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనుండగా.. 9.45 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరు.
3) మధ్యాహ్యం ఎగ్జామ్ 2:30 గంటల నుంచి 5:00 గంటల వరకు నిర్వహించనుండగా.. 2.15 తరువాత ఎగ్జామ్ సెంటర్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్-2కు మధ్యాహ్నం ఒంట గంట నుంచి కేంద్రంలోకి అనుమతిస్తారు.
4) ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, నిషేధిత, విలువైన వస్తువులు తీసుకురావద్దు.
5)షూలు ధరించి రావొద్దు.
6) దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో వేలిముద్రను తప్పనిసరి చేశారు. అభ్యర్థులు ప్రతీ సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్ ను ఇన్విజిలేటర్ కు అందించి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
7) ఎగ్జామ్ సెంటర్లలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్ కు అభ్యర్థులు ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది.8) ఓఎంఆర్ షీట్లో బ్లూ/బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు
8) ఎగ్జామ్ సెంటర్లలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్ కు అభ్యర్థులు ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది.
9) ఓఎంఆర్ షీట్లో బ్లూ / బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుంది.
10) హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదు.