Tuesday, May 28, 2024

ఎవ్వరినీ వదిలిపెట్టను

తప్పక చదవండి
  • శత్రువులంతా ఒక్కటయ్యారు`
  • ప్రతిపక్ష పార్టీల్లో భయం కనిపిస్తోంది
  • ప్రతిపక్షాలను చూస్తే జాలేస్తోంది
  • ప్రతిపక్షాలకు స్కామ్‌ల అనుభవం మాత్రమే ఉంది
  • మధ్యప్రదేశ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ
  • భోపాల్‌లో 5 వందే భారత్‌ రైళ్ల ప్రారంభం

భోపాల్‌, 2014, 2019 ఎన్నికల్లో లేని భయం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోందని, 2024లో బీజేపీకి ఓటేయాలనే ప్రజల సంక్షల్పాన్ని విపక్షాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన బీజేపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల పాట్నా వేదిక జరిగిన విపక్షాల సమావేశం గురించి ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. గత రెండు సార్వత్రిక ఎన్న్కిల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలు రెచ్చిపోలేదని.. ఇప్పుడు శత్రువులంతా ఒక్కటయ్యారని ఆయన అన్నారు. ఒకరినొకరు తిట్టుకునే పార్టీలు ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారని ఆయన అన్నారు. వారిని చూస్తే జాలేస్తోందని ప్రతిపక్షాలపై ఎద్దేవా చేశారు.2024 ఎన్నికల ముందు విపక్షాల ఐక్యతను ప్రధాని మోడీ కొట్టిపారేశారు. ప్రతిపక్షాల భయాల్ని చూస్తే 2024లో ప్రజలు మరోసారి బీజేపీకి ఓటేయాలనే సంకల్పం కనిపిస్తోందని మోడీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌ క్వీప్‌ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు కొన్ని నెలలు ఉండటంతో ప్రతిపక్షాలు ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ‘గ్యారెంటీ’ అనే పదం పాపులర్‌ అవుతోందని.. ఈ మధ్య ఓ ఫోటో సెషన్‌ మీటింగ్‌ జరిగింది.. ఈ ఫోటోలు చూస్తే అందరూ కలిసి రూ. 20 లక్షల కోట్ల అవినితీ చేయడం గ్యారెంటీ అని అనిపిస్తోందని ప్రతిపక్ష పార్టీల పాట్నా సమావేశాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఆర్జేడీ, టీఎంసీ, కాంగ్రెస్‌, ఎన్సీపీల ఉద్దేశిస్తూ.. ఆ పార్టీలకు అవినీతికి సంబంధించిన హామీ మాత్రమే ఉందని, ప్రజలు అవినీతిపరులను శిక్షించే హామీని అంగీకరిస్తారా..? లేక అవినీతి చేసే పార్టీల హామీని అంగీకరిస్తారా..? తేల్చుకోవాలని ప్రధాని సూచించారు. గత వారం పాట్నాలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌, టీఎంసీ, ఆప్‌, ఎన్సీపీ మొత్తం 17 పార్టీల నేతల సమావేశం అయ్యారు. 2024 ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని మోడీని అడ్డుకునేందుకు ఐక్యంగా పోరాడాలని అన్ని పార్టీలు అనుకుంటున్నాయి. ప్రతిపక్షాల ఐక్యంగా బీజేపీ ఓడిరచాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరో సమావేశం వచ్చే నెలలో సిమ్లాలో జరగబోతోంది.భోపాల్‌ రైల్వేస్టేషన్‌లో 5 వందే భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక్కరోజులోనే ఐదు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించారు. భారతీయ రైల్వే ఒక్కరోజులో 5 వందే భారత్‌ ట్రైన్స్‌ ప్రారంభించడం ఇదే మొదటిసారి. అంతకుముందు ఒకే రోజు రెండు వందే భారత్‌ ట్రైన్స్‌ ప్రారంభించిన రికార్డ్‌ ఉంది. ఈసారి ఏకంగా 5 వందే భారత్‌ ట్రైన్స్‌ ప్రారంభించింది భారతీయ రైల్వే. మధ్యప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ భోపాల్‌లోని రాణీ కమలాపతి రైల్వేస్టేషన్‌ నుంచి ఐదు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించారు. అందులో రెండు రైళ్లను ప్రత్యక్షంగా ప్రారంభించగా, మరో మూడు రైళ్లను వర్చువల్‌ ఈవెంట్‌ ద్వారా ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లో రెండు, కర్నాటకలో ఒకటి, బీహార్‌ , రaార?ండ్‌ రాష్ట్రాలను కనెక్ట్‌ చేస్తూ ఒక రైలు, ముంబై-గోవా రూట్‌లో మరో వందే భారత్‌ ట్రైన్‌ ప్రారంభమైంది. ఇప్పటివరకు భారతదేశంలో 18 వందే భారత్‌ రైళ్లు తిరుగుతుండగా, తాజాగా ప్రారంభించిన 5 వందే భారత్‌ ట్రైన్స్‌తో ఈ సంఖ్య 23కి చేరుకుంది.తాజాగా ప్రారంభమైన వందే భారత్‌ రైళ్ల రూట్స్‌ చూస్తే మధ్యప్రదేశ్‌లో ఒకే రోజు రెండు వందే భారత్‌ రైళ్లు ప్రారంభం అయ్యాయి. భోపాల్‌-జబల్‌పూర్‌, భోపాల్‌-ఇండోర్‌ వరకు రెండు వందే భారత్‌ ట్రైన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే న్యూ-ఢల్లీి భోపాల్‌ వందే భారత్‌ ట్రైన్‌ అందుబాటులో ఉంది. కర్నాటకలో రెండో వందే భారత్‌ రైలు ప్రారంభమైంది. ఈ రైలు బెంగళూరు నుంచి హుబ్లీ మీదుగా ధార్వాడ్‌ వరకు ఈ వెళ్తుంది. 490 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటల 13 నిమిషాల్లో కవర్‌ చేస్తుంది. ఇప్పటికే మైసూర్‌-చెన్నై రూట్‌లో వందే భారత్‌ ట్రైన్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముంబై-గోవా మధ్య వందే భారత్‌ రైలు ప్రారంభం అయింది. ముంబై-గోవా వందే భారత్‌ ట్రైన్‌ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా, ఒడిషా రైలు ప్రమాదం కారణంగా వాయిదా పడిరది. ఇప్పటికే ముంబై నుంచి గాంధీనగర్‌, సోలాపూర్‌, సాయినగర్‌ షిరిడీ, నాగ్‌పూర్‌-బిలాస్‌ రూట్లల్లో వందే భారత్‌ ట్రైన్స్‌ నడుస్తున్నాయి. ఇక బీహార్‌, ఘురాండ్లకు మొదటి వందే భారత్‌ రైలు అందుబాటులోకి వచ్చింది. పాట్నా, రాంచీ రూట్‌లో వందే భారత్‌ ట్రైన్‌ ప్రారంభం అయింది. ఈ రెండు నగరాల మధ్య ఆరు గంటల్లో ప్రయాణించవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్‌-విశాఖపట్నం, సికింద్రాబాద్‌-తిరుపతి రూట్లల్లో వందే భారత్‌ ట్రైన్స్‌ నడుస్తున్నాయి. సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌, కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌-పూణె రూట్లల్లో వందే భారత్‌ ట్రైన్స్‌ ప్రారంభం అవుతాయని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు