- తరలి వచ్చిన వేలాది మంది బీజేపీ కార్యకర్తలు..
- శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న బీజేపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్. - ఎయిర్పోర్ట్ నుంచి ఓపెన్ టాప్ వాహనంలో బయలుదేరిన
సంజయ్ కి అడుగడుగునా అపూర్వ స్వాగతం.. - బండి నాయకత్వం వర్ధిల్లాలంటూ మిన్నంటిన నినాదాలు..
హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారి హైదరాబాద్ విచ్చేసిన బండి సంజయ్ కు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి. డప్పు వాయిద్యాలు, డ్యాన్సులతో బండి సంజయ్ కు కనీవినీ ఎరగని రీతిలో ఘన స్వాగతం పలికారు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. బండి సంజయ్ ను తమ భుజాలపైకి ఎత్తుకుని ఎయిర్ పోర్టు నుండి బయటకు తీసుకుని వచ్చారు కార్యకర్తలు. బీజేపీ జిందాబాద్, బండి సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తల మిన్నంటిన నినాదాలతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మారుమ్రోగిపోయింది..
ఈ క్రమంలో బండి సంజయ్ ను కలిసేందుకు, కరచాలనం చేసేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు.. అందరికీ అభివాదం చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగారు బండి సంజయ్.. ఓపెన్ టాప్ జీపులో ఎక్కి ఆయన వేలాది మంది కార్యకర్తలతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు..
ఈ క్రమంలో బండి సంజయ్ కు బ్రహ్మరథం పట్టారు బీజేపీ శ్రేణులు…ఎయిర్ పోర్ట్ నుండి నాంపల్లి వైపు ర్యాలీగా వస్తున్న బండి సంజయ్ కు బాణా సంచా పేలుస్తూ, డ్యాన్సులేస్తూ జోరుగా నినాదాలు చేస్తూ అడుగడుగునా స్వాగతం పలికారు.. అంతకు ముందు శంషాబాద్ పట్టణంలో బుక్కా వేణుగోపాల్ ఆధ్వర్యంలో కాషాయ పగిడీలు ధరించి బండి సంజయ్ కు వందలాది మంది కార్యకర్తలు స్వాగతం పలికారు..