- ఇతర సర్వీసు అంశాలపై నిరంతర కృషి..
ఇటీవలే 2022 సం. నుండి ఓయూ ఔట, అఖిల భారతీయ రాష్ట్రీయ సైన్స్ సిక్ మహా సంఘ్ ల నిరంతర వినతిపత్రలతో యూజీసీ రెగ్యులేషన్స్ పాత పద్దతిలోనే.. క్యారీయర్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ ( సి ఎ ఎస్ ), ప్రమోషన్స్ పాత విధానాన్నే కొనసాగించాలని, యూజీసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల.. ఓయూ ఔట అధ్యక్షుడు ప్రో.బి.మనోహర్, ఎ.బి.ఆర్.ఎస్.యం. తెలంగాణ శాఖ అధ్యక్షులు ప్రో.ఎన్.కిషన్, స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ డా. పోల సోమేశ్వర్ లు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పాత యూజీసీ రెగ్యులేషన్స్ కోసం తాము అనేక మార్లు యూజీసీ చైర్మన్, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లకు స్వయంగా కలిసి వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు. స్పందించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గెజిట్ తో యూనివర్సిటీ, డిగ్రీ కళాశాల లెచ్చరర్స్ పదోన్నతులు పొందుతారు అని వారు అభిప్రాయ పడ్డారు. ఇంకా తమ సర్వీస్ మ్యాటర్ అంశంపై సానుకూలంగా స్పందించాలని వారు కేంద్ర విద్యాశాఖ మంత్రిని, యూజీసీ చైర్మన్ ప్రో. జగదీష్ కుమార్ ను కోరారు. ఇతర సర్వీస్ అంశలపై త్వరలోనే ఢిల్లీ పర్యటన చేస్తామన్నారు.