Thursday, May 2, 2024

రైతులకు తీపికబురు..

తప్పక చదవండి
  • నేటి నుంచి రైతు రుణమాఫీ తిరిగి ప్రారంభం..
  • 19 వేల కోట్ల రుణమాఫీ చేయనున్నట్టు కేసీఆర్ హామీ..
  • కేంద్రం తీరు వల్లే రుణమాఫీ జాప్యమైనట్లు ఆరోపణ..
  • నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా ఉంటోంది..
  • సెప్టెంబర్ 2వ వారం లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం..

రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆదేశించారు. నేటి నుండి నుంచి తిరిగి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నేటి నుంచి తిరిగి ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ.. నెలా పదిహేను రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు.. రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని తెలిపారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర సర్కారు ప్రధాన లక్ష్యమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే.. కేంద్ర సర్కారు తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనంతో పాటు కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులు విడుదల చేయకపోవటం, తెలంగాణ పట్ల కేంద్రం చూపిన వివక్ష… లాంటి కారణాల వల్ల ఆర్థికలోటుతో ఇన్నాళ్లు కొంత ఆలస్యమైందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే.. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న క్రమంలో.. రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్ తెలిపారు.

ఈ విషయంపై ప్రగతిభవన్‌లో బుధవారం రోజున సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు, ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

“ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించాం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల, కేంద్రం ఎఫ్ఆర్బిఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం పాటు జాప్యం జరిగింది. రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో నిరాటంకంగా కొనసాగిస్తూనే వస్తుంది. తమ ప్రభుత్వం ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు.” అని కేసీఆర్ స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు